ETV Bharat / bharat

సొరంగం కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి - కూలిన సొరంగం

Tunnel Collapse: మధ్యప్రదేశ్​లో నిర్మాణ దశలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగాయి సహాయక బృందాలు.

Tunnel Collapse
Madhya Pradesh
author img

By

Published : Feb 14, 2022, 7:56 AM IST

Tunnel Collapse: మధ్యప్రదేశ్​లోని కట్నిలో నిర్మాణ దశలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఏడుగురిని రక్షించినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. చనిపోయిన కూలీల్లో ఒకరు (గోరాలాల్​) మధ్యప్రదేశ్​కు చెందినవారు కాగ, మరొకరిది (రవి మసల్కర్​) మహారాష్ట్రగా గుర్తించారు.

Tunnel Collapse
సహాయక చర్యలు

ప్రాణాలతో బయటపడిన ఏడుగురు కూలీలను కట్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.

ఏంటీ ప్రమాదం.. ఎలా జరిగింది..?

బార్గీ కెనాల్​ ప్రాజెక్ట్​లో భాగంగా భూగర్భ సొరంగం నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో 70 అడుగుల లోతుకు కూలీలు తవ్వారు. ఈ క్రమంలో మట్టి ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో టన్నెల్​ కింద ఉన్న 9 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలను చేపట్టిన ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఈఆర్​ఎఫ్​ బృందాలు ఏడుగురిని ప్రాణాలతో రక్షించగలిగాయి.

ఇదీ చూడండి: కూలిన సొరంగం- శిథిలాల్లో చిక్కుకుపోయిన కూలీలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.