ETV Bharat / bharat

పన్నుల వసూలతో 'కంజర్ల ముఠా' కొత్త దందా!

రాజస్థాన్​ అడ్డాగా కార్యకలాపాలు సాగించే కంజర్ల ముఠా.. మధ్యప్రదేశ్​ సరిహద్దు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. దోపిడీలు, స్మగ్లింగ్​, కిడ్నాప్​లతో గ్రామాల ప్రజలను నిద్రపోనివ్వకుండా చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వీరు ఓ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. తాము దోచుకోకుండా ఉండాలంటే.. గ్రామస్థులే "సేఫ్టీ ట్యాక్స్​" కట్టాలని తేల్చిచెప్పారు. ముఠా సభ్యులే స్వయంగా పన్నులను వసూలు చేస్తారు. ప్రాణ భయంతో ప్రజలు ఆ పన్నులు కట్టక తప్పడం లేదు. రోజూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నట్టు 'ఈటీవీ భారత్​'తో తమ బాధను వెళ్లగక్కుతున్నారు. తమ జీవితాలు మారే రోజు కోసం ఎదురుచూస్తున్నట్టు చెబుతున్నారు.

Madhya Pradesh: 'Kanjars' collect safety tax from villagers for not committing crime
పన్నుల వసూలతో 'కంజర్ల ముఠా' కొత్త దందా!
author img

By

Published : Jan 12, 2021, 6:10 AM IST

పన్నుల వసూలతో 'కంజర్ల ముఠా' కొత్త దందా!

'అర్ధరాత్రి వేళ గ్రామాల మీద పడటం.. ఇంటి తలుపులు బద్దలుకొట్టుకుని లోపలకు వెళ్లడం.. దొరికింది దొరికినట్టు దోచుకుని, అవసరమైతే చంపేందుకు కూడా వెనుకడుగు వేయకపోవడం...' వింటుంటే.. ఇదేదో తమిళ సినిమా కథ చెబుతున్నారని అనుకుంటే మీరు పొరబడ్డట్టే. ఎందుకంటే మధ్యప్రదేశ్​లోని గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా సాగుతున్నది ఇదే. అయితే నేరాలకు పాల్పడుతున్న ఈ భయంకర ముఠా.. ఒక అడుగు ముందుకేసి.. గ్రామాల్లోని ప్రజల నుంచి "సేఫ్టీ ట్యాక్స్​" వసూలు చేస్తోంది. అంటే.. తమను, తమ ఇళ్లను ఎవరూ దోచుకోకుండా ఉండటానికి అక్కడి ప్రజలు పన్నులు కడుతున్నారన్న మాట.

హడలెత్తిస్తున్న ముఠా..

కంజర్ల​ ముఠా పేరు వింటేనే మధ్యప్రదేశ్​ ప్రజలు గడగడలాడిపోతారు. దోపిడీ, స్మగ్లింగ్​, కిడ్నాప్​ల​కు ఆ ముఠా పెట్టింది పేరు. రాజస్థాన్​లోని చమెలా, పఠాన్​ తదితర ప్రాంతాల్లో వీరి స్థావరాలు ఉన్నప్పటికీ.. మధ్యప్రదేశ్​లోని సరిహద్దు గ్రామాలపై వీరు విరుచుకుపడుతుంటారు. ముఖ్యంగా రత్లామ్​ జిల్లాలోని అలోట్​తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరి ఆగడాలు దారుణంగా ఉంటాయి.

ఓవైపు కొన్ని ప్రాంతాల్లో అలజడులు సృష్టిస్తూనే.. మరికొన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ఓ వెసులుబాటు కల్పించారు ముఠా సభ్యులు. తమకు "సేఫ్టీ ట్యాక్స్​" కట్టాలని.. అప్పుడు ఆ గ్రామం జోలికి రామని తేల్చిచెప్పారు. ఇక చేసేదేమీ​ లేక... గ్రామస్థులు పన్నులు కడుతున్నారు. పన్నులు వసూలు చేయడానికి ముఠా సభ్యులే స్వయంగా వస్తారు.

కొన్నికొన్ని సార్లు.. పన్నులు కట్టిన గ్రామాలపైనా దాడులు చేస్తారు నేరగాళ్లు. ఇవి జరిగిన కొన్ని రోజులకు.. వారు ఏర్పాటు చేసిన మధ్యవర్తులు వెళ్లి ముఠా దోచుకున్నది వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.

ఇలా నిత్యం భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నట్టు 'ఈటీవీ భారత్​'కు తమ ఆవేదనను వ్యక్తం చేశారు అక్కడి ప్రజలు. ఒకవేళ పన్ను చెల్లించకపోతే రక్తం వచ్చేలా కొడతారని చెబుతున్నారు.

"100-150 గ్రామాల్లో వీరి ఆకృత్యాలు జరుగుతూ ఉంటాయి. మామూళ్లు ఇవ్వకపోతే ఇక అంతే! వాళ్ల పొలాలకు, ఇళ్లకు వెళ్లి కొడతారు. పొలాల్లో మోటర్లు ఎత్తుకెళతారు. ఇళ్లలోకి వెళ్లి వాహనాలు దొంగిలిస్తారు. మామూళ్లు ఇవ్వకపోతే గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తామని హెచ్చరిస్తారు."

--- మహేంద్ర ఠాకూర్, అలోట్​ గ్రామస్థుడు

పోలీసుల మాట...

ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు తమను పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కంజర్ల ముఠా ఆగడాల గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరని పోలీసులపై మండిపడుతున్నారు.

ఈ విషయంపై పోలీసులు స్పందన భిన్నంగా ఉంది. తమకు అందిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అయితే చాలా సందర్భాల్లో ఫిర్యాదులు అందడం లేదంటున్నారు.

"కంజర్ల వల్ల నష్టం జరుగుతోందంటున్నారు. వాహనాలు ఎత్తుకెళుతున్నారంటున్నారు. నేను చెప్పేది ఒక్కటే. ఘటన జరిగిన తర్వాత చెబితే ఫలితం ఉండదు. ఈ విషయాన్ని ముందే చెప్పాను. అందుకే ముందు ఎవరైనా వచ్చి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయండి. మీరు చూస్తూనే ఉన్నారు.. పోలీసులు పనిచేస్తున్నారు. రాత్రింబవళ్లు పెట్రోలింగ్​ నిర్వహిస్తున్నారు. దొంగలను పట్టుకుంటున్నారు."

-- సునీల్​ పాటిదార్​, రత్లాం జిల్లా అదనపు ఎస్​పీ.

తిరుగుబాటు!

కంజర్ల ముఠా వ్యవహారంపై ప్రజల్లో రోజురోజుకు అసహనం పెరిగిపోతోంది. ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడాలని ఎదురుచూస్తున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి కంజర్ల స్థావరాలపై దాడి చేశారు. అయితే ఇలా చేసిన ఆరుగురిపై రాజస్థాన్​ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:- 'గాడ్సే' లైబ్రరీ ప్రారంభించిన హిందూ మహాసభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.