మధ్యప్రదేశ్‌లో కరోనా బారిన పడి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బ్రిజేంద్ర సింగ్ రాథోడ్ కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రాగా.. ఆదివారం తుది శ్వాస విడిచారని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.
తికంగఢ్ జిల్లా పృథ్వీపుర్ అసెంబ్లీ స్థానానికి బ్రిజేంద్ర సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. భోపాల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. దామోహ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బ్రిజేంద్ర సింగ్ ఇన్‌ఛార్జ్‌గానూ వ్యవహరించారు.
బ్రిజేంద్ర సింగ్ మృతి పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ , ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ సంతాపం తెలిపారు.
ఇదీ చూడండి: 'దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ చేపట్టండి'