ETV Bharat / bharat

'మోదీని చంపేందుకు సిద్ధం కావాలి'.. వివాదాస్పద కాంగ్రెస్​ నేత పటేరియా అరెస్ట్

ప్రధానమంత్రి మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్​ నేత రాజా పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలన్నా మైనారిటీలు, దళితులు క్షేమంగా ఉండాలన్నా ప్రధాని మోదీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

raja pateria arrested
raja pateria arrested
author img

By

Published : Dec 13, 2022, 10:15 AM IST

Updated : Dec 13, 2022, 10:25 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాజా పటేరియాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలన్నా మైనారిటీలు, దళితులు క్షేమంగా ఉండాలన్నా ప్రధాని మోదీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజా పటేరియాపై సోమవారం కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.

ఆయన్ను ఎందుకు అరెస్టు చేశారంటే?
ప్రధాని మోదీని ఉద్దేశించి మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రాజా పటేరియా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చక్కర్లు కొట్టింది. అందులో.. "రాజ్యాంగాన్ని, మైనార్టీలు, దళితుల భవిష్యత్తును కాపాడేందుకు మోదీని 'చంపేందుకు' సిద్ధం కావాలి. 'చంపడం' అంటే ఆయనను ఓడించడమని అర్థం" అని పటేరియా అన్నట్లు ఆ వీడియోలో ఉంది. పన్నా జిల్లా పవయీలో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "మోదీ ఎన్నికలను లేకుండా చేస్తారు. మతం, కులం, భాష ప్రాతిపదికన విభజిస్తారు. దళితులు, గిరిజనులు, మైనార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడింది" అని పటేరియా అన్నారు.

ఈ వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీని ఎన్నికల్లో 'ఓడించాలన్నదే' తన ఉద్దేశమని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పటేరియాపై కేసు నమోదు చేయాల్సిందిగా మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్ర ఆదేశించారు. ఈ మేరకు పవయీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పటేరియా వ్యాఖ్యలను భాజపాతో పాటు కాంగ్రెస్‌ నాయకులు కూడా ఖండించారు.

Last Updated : Dec 13, 2022, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.