ETV Bharat / bharat

7 రాష్ట్రాలు దాటేసి.. 8 వేల గ్రామాలు చుట్టేసి..

author img

By

Published : Jan 12, 2021, 10:17 AM IST

ప్లాస్టిక్​ వాడకంతో పర్యావరణానికి పెనుముప్పు అని తెలిసినా.. వినియోగించడం మాత్రం ఆపరు. ప్లాస్టిక్​ వాడకంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ.. సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ నష్టాలు, పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు నడుం బిగించాడు ఓ వ్యక్తి. దేశం మొత్తం సైకిల్​పై తిరుగుతూ సేంద్రీయ సాగుపైనా అవగాహన కల్పిస్తున్నారు. అలా ఇప్పటివరకు 7 రాష్టాల్లో సుమారు 8 వేల గ్రామాలను సందర్శించాడు బ్రజేశ్​ శర్మ.

Madhya Pradesh bicycle man on mission to spread awareness across country
పర్యావరణాన్ని కాపాడేందుకు మధ్యప్రదేశ్ వాసి సైకిల్ యాత్ర!
సైకిల్​యాత్ర చేపట్టిన బ్రజేశ్​!

మనసున్నచోట మార్గం ఉంటుందని నిరూపిస్తున్నాడు మధ్యప్రదేశ్​ వాసి బ్రజేశ్ శర్మ. మొరెనా జిల్లాకు చెందిన ఆయన.. దేశ విదేశాలలో సుమారు 20వేల కిలోమీటర్లకుపైగా సైకిల్​పై తిరిగి.. సేంద్రీయ వ్యవసాయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపైనా తనదైన పాత్ర పోషిస్తోన్న బ్రజేశ్​.. సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ నిషేధంపై పోరాటం చేస్తున్నారు. ఇందుకోసం ఏడాది కాలంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. ఇటీవల గుజరాత్ భావ్​నగర్​కు చేరుకున్నారు.

Madhya Pradesh bicycle man on mission to spread awareness across country
బ్రజేశ్​ శర్మ

ఆ సంఘటనతో కనువిప్పు..

ఐరోపాలోని ఓ ప్రైవేట్​ కంపెనీలో పనిచేస్తోన్న శర్మ.. ప్లాస్టిక్​ వ్యర్థాలలో చిక్కుకున్న ఓ పక్షి వీడియోను చూసి చలించిపోయారు. అప్పటినుంచి ప్లాస్టిక్​ వాడకం.. పర్యావరణానికి తీరని హాని చేస్తోందని గమనించారు. సైకిల్ ర్యాలీ చేస్తూ ప్రపంచదేశాలకు ప్రకృతిపై అవగాహన కల్పించడం ప్రారంభించారు. తన యాత్రలో భాగంగా భారత్​లో ఇప్పటివరకు ఏడు రాష్ట్రాలను చుట్టేశారాయన. అందులో 105 నగరాలు, 8 వేలకుపైగా గ్రామాలు సహా.. ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

సేంద్రీయ వ్యవసాయంపై రైతులతో మాటామంతీ..

సేంద్రీయ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు, సింగిల్ యూజ్​ ప్లాస్టిక్​ వ్యర్థాల వల్ల ప్రమాదాలను గురించి బోధిస్తున్నారు బ్రజేశ్​. అలా ఇప్పటివరకు సుమారు 22 కళాశాలల్లో ప్రసంగించారు. సైకిల్​పై వెళ్లే క్రమంలో ఆయా గ్రామాల్లో పర్యటించి.. అక్కడి రైతులతో మాట్లాడుతున్నారు.

వారు జత కలిశారలా..

శర్మ.. ముంబయి పర్యటనలో ఉన్నప్పుడు దేశవ్యాప్త లాక్​డౌన్​ విధించింది కేంద్రం. నాడు సమీప అటవీ ప్రాంతంలో గడిపిన ఆయనకు.. అదే సమయంలో దీప్తి షా, కృష్ణకాంత్ పరిఖ్​లతో పరిచయం ఏర్పడింది. అలా వారు కూడా శర్మతో కలిసి సైకిల్​పై తిరుగుతూ.. అవగాహన కల్పిస్తున్నారు.

బ్రజేశ్​ శర్మతో దీప్తి షా, కృష్ణకాంత్​ పరిఖ్​

ఇదీ చూడండి: అధ్యాపక వృత్తిని వదిలి.. ప్రకృతి సేవలోకి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.