ETV Bharat / bharat

Mangalyaan mission: 6 నెలలు అనుకుంటే.. 7 ఏళ్లు దాటేసింది..! - ఇస్రో

ఆరు నెలలు పనిచేసేలా రూపొందించిన 'మంగళయాన్‌' వ్యోమనౌక(Mangalyaan mission) సేవలు అప్రతిహతంగా సాగుతున్నాయి. అంగారకుడి కక్ష్యలో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. అవిశ్రాంత పరిశోధనలు జరుపుతూ.. ఇప్పటికీ అద్భుతంగా సేవలు అందిస్తోంది. దీనిపై ఇస్రో మాజీ ఛైర్మన్​ కే రాధాకృష్ణన్(isro chairman) హర్షం వ్యక్తం చేశారు.

Mangalyaan orbiter
మంగళయాన్‌ వ్యోమనౌక
author img

By

Published : Sep 27, 2021, 7:31 AM IST

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన మంగళయాన్‌ వ్యోమనౌక(mangalyaan orbiter mission).. అంగారకుడి కక్ష్యలో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. వాస్తవానికి ఆరు నెలలు పనిచేసేలా దీన్ని రూపొందించగా.. అది ఇప్పటికీ అద్భుతంగా సేవలు అందిస్తోంది. తాజా మైలురాయిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ ఛైర్మన్​ కే రాధాకృష్ణన్‌ (mangalyaan team) హర్షం వ్యక్తం చేశారు. ఈ వ్యోమనౌక ప్రయోగ నమయంలో ఆయనే సంస్థకు నేతృత్వం వహించారు. 2013 నవంబరు 5న(mangalyaan launch date) మంగళయాన్‌ను ఇస్రో(mangalyaan mission) ప్రయోగించింది. ఆ మరుసటి సంవత్సరం సెప్టెంబరు 24న అది విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి చేరింది. తద్వారా తొలి ప్రయత్నంలోనే అరుణ గ్రహాన్ని చేరిన మొట్టమొదటి దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది.

Mangalyaan orbiter
మంగళయాన్‌ వ్యోమనౌక

సాంకేతిక సత్తా ప్రదర్శన కోసమే ఈ వ్యోమనౌకను ప్రయోగించినప్పుటికీ.. అనుకున్న లక్ష్యాలన్నింటినీ మంగళయాన్​ విజయవంతంగా పూర్తి చేసిందని ఇస్రో అధికారులు(mangalyaan isro) తెలిపారు. దీనిద్వారా గ్రహాంతర యాత్రల విషయంలో అనేక కొత్త అంశాలను నేర్చుకున్నామని చెప్పారు. ఇలాంటి వ్యోమనౌకల్లోని వ్యవస్థలు, ఉప వ్యవస్థల డిజైన్‌, తయారీ, నిర్ధిష్టంగా వ్యోమనౌకను వేరే గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం, అంగారక కక్ష్యలో ఉండగా శాస్త్రీయ పరికరాల నిర్వహణ వంటివాటిపై అనేక విషయాలు తమకు అవగతమయ్యాయని పేర్కొన్నారు.

భవివ్యత్‌లో మరిన్ని గ్రహాంతర యాత్రలు చేపట్టేలా తమ విశ్వాసాన్ని ఇవి పెంచాయని తెలిపారు. ఈ వ్యోమనౌకను, అందులోని ఐదు. శాస్త్రీయ పరిశోధన పరికరాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అక్కడి నుంచి వచ్చిన డేటాను విశ్లేషిస్తున్నామని చెప్పారు. ఈ వ్యోమనౌకలోని కదిలే భాగాల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంగళయాన్‌కు ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎం.అన్నాదురై (isro mangalyaan missio)తెలిపారు. దీంతో ప్రత్యామ్నాయ పరికరాలను వినియోగించాల్సి వస్తోందని వివరించారు. మొత్తం మీద ఈ వ్యోమనౌక చాలావరకూ బాగానే ఉందన్నారు. మరో ఏడాది పనిచేసే అవకాశం ఉందని తెలిపారు.

ఇంత దీర్ఘకాలం పాటు ఇది సేవలు అందించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. "చంద్రయాన్‌..1 వ్యోమనౌక ప్రయోగ సమయంలో నేర్చుకున్న పాఠాల ఆధారంగా కొన్ని సర్దుబాటు చేసుకున్నాం. వ్యోమనౌక డిజైన్‌లో మార్పులు, ఇంధన నిర్వహణ వంటి అంశాల్లో కొత్త విషయాలు నేర్చుకున్నాం" అని వివరించారు.

ఇదీ చూడండి: కొత్త పార్లమెంటు నిర్మాణ పనులను పరిశీలించిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.