లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ హెడ్ ఎంఏ యూసఫ్ అలీకి ప్రమాదం తప్పింది. కేరళ పనాంగడ్ సమీపంలో అలీ.. చాపర్ బలంగా భూమిని ఢీకొట్టి అత్యవసర ల్యాండింగ్ అయింది.
హెలికాప్టర్‌లో యూసఫ్ అలీ, ఆయన భార్య సహా మొత్తం ఏడుగురు ఉన్నారు. వారందరినీ ఆస్పత్రికి తరలించారు.
కారణం అదే..
సాంకేతిక లోపం కారణంగానే హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ చిత్తడి భూమిలో దిగినందువల్ల పెను ప్రమాదం తప్పినట్లు పేర్కొన్నారు. ల్యాండింగ్ తర్వాత చాపర్లోని సభ్యులందరినీ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామన్నారు. యూసఫ్ అలీ సహా ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇదీ చదవండి : విమానం టాయిలెట్లో 1.36 కిలోల బంగారం