ETV Bharat / bharat

Ludhiana Bomb Blast: లుథియానా బాంబు పేలుళ్ల మృతుడు.. మాజీ పోలీసు - లుథియానా బాంబు పేలుడు ఘటన

Ludhiana Bomb Blast: పంజాబ్​ లుథియానా కోర్టు ప్రాంగణంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుడు మాజీ పోలీసు అని తేలింది. మృతుడిని.. డ్రగ్స్​ కేసులో డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్ గగన్​దీప్​గా అధికారులు గుర్తించారు.

ludhiana
లుథియానా కోర్టు
author img

By

Published : Dec 25, 2021, 5:42 AM IST

Ludhiana Bomb Blast: పంజాబ్‌లోని లుథియానా కోర్టు ప్రాంగణంలో గురువారం జరిగిన బాంబు పేలుళ్ల కేసులో మృతుడు.. 2019లో డిస్మిస్‌ అయిన పంజాబ్‌ పోలీసు హెడ్‌ కానిస్టేబుల్ గగన్‌దీప్‌ సింగ్‌గా శుక్రవారం గుర్తించారు. లుథియానాలోని ఖన్నా ప్రాంతానికి చెందిన గగన్‌దీప్‌ డ్రగ్స్‌ కేసులో డిస్మిస్‌ అయ్యారు. ఈయనను గుర్తించడంలో మొబైల్‌ సిమ్‌కార్డు పోలీసులకు ఉపయోగపడింది.

కాగా, ఈ కేసులో దర్యాప్తునకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ ఛన్నీ అంతకుముందు వెల్లడించారు. బాంబు పేలిన ప్రాంతాన్ని కేంద్ర న్యాయమంత్రి కిరణ్‌ రిజిజు పరిశీలించారు.

ఇదీ జరిగింది..

పంజాబ్​లోని లుథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్​లో పేలుడు సంభవించింది. రెండో అంతస్తులో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఉదయం 11 గంటలకు రెండో అంతస్తులోని కోర్టు నంబరు 14 సమీపంలో శౌచాలయం వద్ద పేలుడు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పేలుడు తీవ్రతకు శిథిలాలు.. ఎగురుకుంటూ వచ్చి కింద ఉన్న వాహనాలపై పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు కోర్టు వద్దకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. పేలుడు కారణాలేమిటని ఆరా తీశారు. ఇంకా ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో గాలించారు. కోర్టు వద్ద భద్రతను పెంచారు.

పేలుడు జరిగిన ప్రాంతాన్ని మూసివేశామని, ఫోరెన్సిక్​ బృందాలు నమూనాలు సేకరిస్తున్నట్లు చెప్పారు లుథియానా పోలీస్​ కమిషనర్​ గుర్​ప్రీత్​ సింగ్​ భుల్లార్​. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చెప్పలేమని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

ఇదీ చదవండి:

కోర్టులో భారీ పేలుడు.. ఒకరు మృతి.. వారి పనేనన్న సీఎం!

జిల్లా కోర్టులో పేలుడు.. ఉగ్రవాదుల పనేనా?

పంజాబ్​లో ఉగ్రదాడులపై ముందే హెచ్చరించిన నిఘా వర్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.