Wife swapping news: ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూ కుటుంబ కోర్టు ముందుకు వచ్చిన ఓ కేసు చర్చనీయాంశమైంది. తన భార్య నుంచి విడాకులు కావాలని భర్త పిటిషన్ దాఖలు చేశాడు. కానీ అతడు చెప్పిన కారణం విని న్యాయమూర్తులే షాకయ్యారు. కోర్టు వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం.. రాజేశ్, దినేశ్ (పేరు మార్చాం) కాలేజ్ రోజుల నుంచి మంచి స్నేహితులు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అయితే వారికి భార్యలను మార్చుకోవాలన్న పాడు ఆలోచన వచ్చింది. దీనికి వారు కూడా అంగీకారం తెలిపారు. దీంతో చాలాసార్లు ఇద్దరూ తమ భార్యలను మార్చుకున్నారు.
అయితే ఇలా తరచూ జరుగుతుండటం వల్ల రాజేశ్ భార్య.. దినేశ్ పట్ల ఆకర్షితురాలయ్యింది. ఈ విషయం తెలిసి రాజేశ్ సహించలేకపోయాడు. దీంతో తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని లఖ్నవూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని, కలసి ఉండలేనని కోర్టుకు చెప్పాడు. పరస్పర అంగీకారంతోనే భార్యలను మార్చుకున్నందున ఈ కేసు అత్యంత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.
Lucknow family court: ఈ కేసుపై సీనియర్ న్యాయవాది సిద్ధాంత్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటివి సాధారణ కేసులు కాదని చెప్పారు. ' ఇలాంటి కేసులు వచ్చినప్పుడు అది నిజానికి భార్యల మార్పిడి కేసు అని మొదట గర్తించలేము. కేసుపై వాదోపవాదనలు, చర్చ జరిగినప్పుడు అసలు కారణం బయటపడుతుంది. ఇలాంటి కేసులు వ్యక్తుల స్వభావాన్ని ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే వాళ్లు సాధారణంగా నిజాలు మాట్లాడరు. భార్యభర్తలిద్దరూ క్రూరమైన ప్రవర్తనను కవచంగా ఉపయోగించుకుంటారు. హిందూ వివాహ చట్టం సెక్షన్ 311లో భార్యభర్తల మధ్య క్రూరత్వ ప్రస్తావన ఉంది. క్రూరత్వం అంటే దాని తీవ్రత ఎలా ఉంది, ఆరోపణలేంటి అనే విషయాలు తెలపాలి. భార్యాభర్తలు ఎలాంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నారు, ఎన్నిసార్లు అవి జరుగుతున్నాయి అనే విషయాలను పరిశీలిస్తారు' అని చెప్పారు.
ఇదీ చదవండి: 'వివాహం అంటే.. భార్యపై లైంగిక వేధింపులకు లైసెన్స్ పొందడం కాదు'