దేశ భద్రతలో అత్యంత కీలకమైన జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి గత కొంత కాలంగా శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి కారణమైన చినార్కాప్స్ కొత్త కమాండర్‌గా లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని సైన్యం ప్రధాన కార్యాలయానికి డీజీఎంఓగా వెళ్తున్న లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
దేశభద్రతలో అత్యంత కీలకమైన కశ్మీర్లో చినార్ కాప్స్‌కు కమాండర్‌గా ఏడాదిగా వ్యవహరించిన బీఎస్ రాజు.. కశ్మీర్లో శాంతి స్థాపనకు శాయశక్తులా కృషి చేశారు. 2020లో కరోనా, ఉగ్రవాదం ఉరిమిన అత్యంత క్లిష్టమైన సమయంలో తన బాధ్యతలు అత్యంత నిబద్ధతతో నిర్వర్తించారు.
ఉగ్రవాదం వైపు మళ్లిన యువతను సన్మార్గంలోకి తీసుకురావడంలో రాజు సఫలీకృతుడయ్యారు. ఈయన కాలంలో సైన్యానికి- పౌరులకు మధ్య సహృద్భావ వాతరవరణం నెలకొంది. కశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్య పదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.
ఇదీ చదవండి: బంగాల్ దంగల్: బుద్ధిజీవుల ప్రసన్నతే లక్ష్యం