ETV Bharat / bharat

ప్రియుడితో పారిపోయేందుకు ప్లాన్​.. తనలా ఉన్న మరో అమ్మాయిని చంపి ఎస్కేప్​ - lovers killed young woman in Haryana

ప్రియుడితో కలిసి పారిపోయేందుకు చూడడానికి తనలాగే ఉన్న మరో యువతిని చంపింది ఓ మహిళ. దీంతో తాను చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించింది. అనంతరం తాను అనుకున్నట్లుగా ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన హరియాణా పానిపత్​లో జరిగింది.

woman killed friend in Haryana
woman killed friend in Haryana
author img

By

Published : Mar 30, 2023, 6:22 AM IST

హరియాణా పానిపత్​లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు చూడడానికి తనలాగే ఉన్న మరో యువతిని చంపింది ఓ మహిళ. దీంతో తాను చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించింది. అనంతరం తాను అనుకున్నట్లుగా ప్రియుడితో కలిసి పారిపోయింది. ప్రియుడితో పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరిండం వల్లే ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన 2017లో జరగగా.. తాజాగా నిందితురాలికి శిక్ష పడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జ్యోతి, క్రిష్ణ అనే ఇద్దరు యువతీయువకులు కాలేజీ రోజుల నుంచే ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటామని జ్యోతి ఇంట్లో చెప్పారు. దీనికి ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరు పారిపోయి పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. జ్యోతి పారిపోయినట్లుగా ఆమె కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా ఉండేందుకు.. తనలాగే ఉండే మరో యువతిని హత్య చేయాలని నిర్ణయించారు. ఓ టీవీ సీరియల్​ ఆధారంగా ప్లాన్​ చేశారు.
పథకం ప్రకారం సిమ్రాన్​ చంపాలని నిర్ణయించుకుని.. 2017లో సెప్టెంబర్​ 5న జీటీ రోడ్డుకు రమ్మన్నారు. మొదట ఆమెతో మత్తు కలిపిన కూల్​డ్రింక్​ను తాగించారు. అనంతరం ఆమె గొంతు కోసి చంపేశారు. చనిపోయిందని నిర్ధరించుకున్న తర్వాత సిమ్రాన్ బట్టలు మార్చారు. ఘటన స్థలంలో జ్యోతికి సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులు పడేసి వెళ్లారు. అనంతరం ఇద్దరు కలిసి పారిపోయారు. ఓ హోటల్​ కలిసి కొద్ది రోజులు జీవించారు.
ఇదిలా ఉండగా జ్యోతి కనిపించడం లేదంటూ అమె కుటుంబ సభ్యులు పానిపత్​ పోలీసు స్టేషన్​లో ఓ కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. సిమ్రాన్​ మృతదేహాన్ని జ్యోతి కుటుంబ సభ్యులకు చూపించారు. సిమ్రాన్​ బాడీకి ఉన్న దుస్తులు, డాక్యుమెంట్ల ఆధారంగా మృతదేహం జ్యోతిదే అయి ఉంటుందని భావించారు. అనంతరం ఇంటికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
అదే సమయంలో సిమ్రాన్​ తల్లిదండ్రులు కూడా తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు జరిపారు. అనుమానం వచ్చి సిమ్రాన్ మృతదేహం ఫొటోను ఆమె తల్లిదండ్రులకు చూపించారు. సిమ్రాన్​ మెడకున్న దారం, ముక్కుపుడక ఆధారంగా ఆ ఫోటో తన కూతురుదేనని ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో చనిపోయిన అమ్మాయి జ్యోతి కాదని, సిమ్రాన్ అని తెలుసుకున్నారు.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రంగంలోకి దిగి జ్యోతి, కృష్ణను వెతికే పనిలో పడ్డారు. వారిద్దరు శిమ్లాలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం 2020లో వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టు విచారణలో ఉండగానే క్షయవ్యాధితో కృష్ణ జైలులోనే చనిపోయాడు. ఈ ఘటనలో మొత్తం 26 మందిని విచారించిన పానిపత్​ కోర్టు.. మంగళవారం తీర్పు వెల్లడించింది. జ్యోతిని దోషిగా తేల్చింది. ఆమెకు జీవిత ఖైదు విధించింది. రూ. 70వేలు సైతం కట్టాలని ఆదేశించింది.

వంట చేయలేదని భార్యను చంపిన భర్త..
ఇంట్లో వంట చేయలేదనే కారణంతో కట్టుకున్న భార్యనే చంపేశాడు ఓ భర్త. ఈ దారుణం దేశ రాజధాని దిల్లీలోని ముకుంద్‌పుర్ ప్రాంతంలో జరిగింది. అయితే మృతురాలు అనారోగ్యంతో బాధపడుతున్నందు వల్లే వంట చేయలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే వంట విషయంలో భార్య ప్రీతిపై ఒక్కసారిగా కోపం పెంచుకున్నాడు భర్త బజరంగీ. దీంతో ఆమెను కర్రతో కొట్టడం ప్రారంభించాడు భర్త. ఈ క్రమంలో భార్య ప్రీతి ప్రాణాలు విడిచింది. కాగా, ఈ దంపతులకు ఆరు నెలల చిన్నారి కూడా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బజరంగీని అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.