ETV Bharat / bharat

'మ్యారీ మీ ఉత్కర్ష'- భారీ హోర్డింగ్​తో యువతికి ప్రపోజ్​.. నెట్టింట వైరల్​

Love proposal with hoarding: 'మ్యారీ మీ ఉత్కర్ష' అంటూ భారీ హోర్డింగ్​తో ప్రపోజ్​ చేసి తన మదిలోని ప్రేయసి మనసు గెలుచుకున్నాడు సౌరభ్​ అనే యువకుడు. జాతీయ రహదారి పక్కనే హోర్డింగ్​ ఏర్పాటు చేయడమే కాదు, అదే హోర్డింగ్​ ముందు ప్రపోజ్​ చేశాడు. ప్రస్తుతం వారి ప్రేమ గురించి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది?

Youth proposed girl through large hoarding in in Kolhapur
హోర్డింగ్​ ముందే ప్రపోజ్​
author img

By

Published : May 19, 2022, 8:41 PM IST

Love proposal with hoarding: అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించి తాను ప్రేమించిన అమ్మాయి మనసు గెలుచుకున్నాడు ఓ యువకుడు. తన ప్రేమను తెలిపేందుకు ఏకంగా భారీ హోర్డింగ్​నే ఏర్పాటు చేశాడు. 'మ్యారీ మీ ఉత్కర్ష' అనే భారీ హోర్డింగ్​ ముందే యువతికి ప్రపోజ్​ చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని కొల్హాపుర్​లో జరిగింది.

Youth proposed girl through large hoarding in in Kolhapur
హోర్డింగ్​ ముందు ప్రేయసితో ఫొటో

కొల్హాపుర్​కు చెందిన సౌరభ్​ కస్బేకర్​ అనే యువకుడు సంగ్లీ జిల్లా, బుధ్గావూన్​లోని వసంత్​రావ్​ దాదా పాటీల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీలో సివిల్​ ఇంజినీరింగ్​ చదువుతున్నాడు. సింగ్లీకి చెందిన ఉత్కర్ష అనే యువతి సైతం సివిల్​ ఇంజినీరింగ్​ చేస్తోంది. 2017 నుంచి ఇరువురు ఒకే కోర్సు చేస్తున్నారు. అయినప్పటికీ గతేడాది వరకు ఇరువురికి అంతగా పరిచయం లేదు. ఇంజినీరింగ్​ పూర్తయిన తర్వాత.. సౌరభ్​కు వివాహం చేయాలని నిశ్చయించారు కుటుంబ సభ్యులు. ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే చెప్పాలని, పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉత్కర్ష అనే యువతి పేరును బయటపెట్టాడు. ఈ క్రమంలో వారి ఇంట్లో మాట్లాడి పెళ్లికి ఒప్పించాలని నిర్ణయించారు. కానీ, సౌరభ్​ దానికి నిరాకరించాడు. ముందుగా వినూత్న రీతిలో ప్రపోజ్​ చేయాలనుకున్నాడు.

Youth proposed girl through large hoarding in in Kolhapur
హోర్డింగ్​ ముందే ప్రపోజ్​

సంగ్లీ-కొల్హాపుర్​ జాతీయ రహదారి పక్కన 'మ్యారీ మీ ఉత్కర్ష' అంటూ భారీ హోర్డింగ్​ ఏర్పాటు చేశాడు సౌరభ్​. ఆ హోర్డింగ్​ ముందే ప్రపోజ్​ చేశాడు. సౌరభ్​ ఇచ్చిన సర్​ప్రైజ్​తో మైమరచిపోయిన ఉత్కర్ష.. వెంటనే ఓకే చెప్పేసింది. సౌరభ్​తో పెళ్లికి సిద్ధమని తేల్చేసింది. ఈ క్రమంలో ఇరువురు హోర్డింగ్​ ముందు ఫొటోలకు ఫోజులిచ్చారు. వారి లవ్​స్టోరీ గురించి జిల్లావ్యాప్తంగా చర్చ మొదలైంది. మే 27న వారి వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. ప్రస్తుతం వారు ఎంటెక్​ చేస్తున్నట్లు తెలిపారు.

హోర్డింగ్​ వద్ద ఫొటోలకు పోజు

ఇదీ చూడండి: సినిమా పోస్టర్లతో కోటు.. మంత్రి డ్రెస్సింగ్​ స్టైల్​ అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.