ETV Bharat / bharat

రూ.100తో లాటరీ టికెట్ కొన్న బాలిక.. రూ.10లక్షలు జాక్​పాట్! - 100 rupees ticket jcokpot

100 Rupees Lottery Ten Lakhs Won: రోజూ స్కూల్​కు వెళ్లే బాలిక.. ఆదివారం సెలవు కావడం వల్ల తన తండ్రి దుకాణానికి వెళ్లింది. తండ్రికి ఇష్టం లేకపోయినా ఒప్పించి మరీ.. ఓ వ్యక్తి దగ్గర రూ.100 లాటరీ టికెట్​ కొనుగోలు చేసింది. అదే వారిని లక్షాధికారులగా మార్చింది. రూ.100 టికెట్​తో పది లక్షల రూపాయలను గెలుచుకుంది ఆ బాలిక. ఈ ఘటన పంజాబ్​లో జరిగింది.

lottery-of-100-rupees-made-little-girl-millionaire-in-amritsar

author img

By

Published : Jul 13, 2022, 3:19 PM IST

100 Rupees Lottery Ten Lakhs Won: అదృష్టం ఎప్పుడు ఎలా తలపుతడుతుందో ఎవరికీ తెలియదు అంటారు. వీరి విషయంలోనూ సరిగ్గా ఇలానే జరిగింది. పంజాబ్​లోని అమృత్​సర్​లో రోడ్డుపైన చిన్నపాటి బండిపై వ్యాపారం చేసుకునే ఓ వ్యక్తి కుమార్తె రూ.100 లాటరీ టికెట్​ కొనుగోలు చేసింది. దీంతో వారు ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోయారు. రూ.100 టికెట్​తో రూ.10 లక్షలు గెలుచుకున్నారు.

lottery-of-100-rupees-made-little-girl-millionaire-in-amritsar
తండ్రితో హర్​సిమ్రన్ కౌర్​

పంజాబ్​లోని అమృత్​సర్​కు చెందిన జమాల్​ సింగ్​.. రోడ్డు మీద చిన్న తోపుడు బండిపై వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆదివారం సెలవని అతడి కుమార్తె హర్​సిమ్రన్​​ కౌర్.. తండ్రికి సాయం చేయడానికి దుకాణానికి వెళ్లింది. అదే సమయంలో లాటరీ టికెట్లు అమ్మే ఓ వ్యక్తి వారి దుకాణానికి వచ్చాడు. టికెట్ కేవలం రూ.100 అని, ఒకటి కొనుగోలు చేయమని అతడు చెప్పాడు. అయితే జమాల్​ సింగ్ మాత్రం​ అందుకు నిరాకరించాడు. కానీ అతడి కుమార్తె హర్​సిమ్రన్​ కౌర్.. తన తండ్రిని ​ఒప్పించి మరీ కొనుగోలు చేసింది.

తండ్రి దుకాణం వద్ద హర్​సిమ్రన్​ కౌర్​

బుధవారం జరిగిన లాటరీ డ్రాలో ఆ బాలిక రూ.10 లక్షలు గెలుచుకుంది. ఆ విషయం తెలిసిన వెంటనే జమాల్​ సింగ్​ కుటుంబంలో ఆనందం వెల్లివెరిసింది. లాటరీలో గెలుచుకున్న మొత్తాన్ని తన తండ్రి వ్యాపారాన్ని మెరుగుపరచడానికి వినియోగిస్తామని హర్​సిమ్రన్​ కౌర్​ తెలిపింది. దాంతో పాటు తన చెల్లెళ్ల చదువు కోసం వెచ్చిస్తామని చెప్పింది.

ఇవీ చదవండి:పిల్లాడిని మింగిందని మొసలిపై డౌట్.. ఊరి జనమంతా కలిసి..

నిత్యానంద స్వామికి 18 అడుగుల విగ్రహం.. ఎక్కడంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.