ETV Bharat / bharat

'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు - అఫ్గన్​ పరిస్థితిపై ముఫ్తీ

జమ్ముకశ్మీర్‌ను ప్రస్తుత అఫ్గానిస్థాన్‌తో పోలుస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించి కేంద్రం తన తప్పును దిద్దుకోవాలని సూచించారు. లేకపోతే అఫ్గన్​లో నుంచి అమెరికా పారిపోయిన పరిస్థితే కేంద్రానికి కూడా పడుతుందని తెలిపారు.

Mehbooba Mufti
మెహబూబా ముఫ్తీ
author img

By

Published : Aug 21, 2021, 8:41 PM IST

అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో అక్కడి పరిణామాలను జమ్ముకశ్మీర్‌తో పోలుస్తూ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించి కేంద్రం తన తప్పును దిద్దుకోవాలని అన్నారు. లేకపోతే అఫ్గన్ నుంచి బలమైన అమెరికా పెట్టాబేటా సర్దుకుని వెళ్లిపోయినట్లు.. కేంద్రానికి కూడా అలాంటి పరిస్థితే ఏర్పడుతుందని హెచ్చరించారు.

జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఎంతో ఓపిక వహిస్తున్నారని అన్న ముఫ్తీ.. వారి సహనాన్ని పరీక్షించవద్దని కేంద్రానికి సూచించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ తమ ప్రభుత్వ హయాంలో జరిపినట్లుగా కేంద్ర ప్రభుత్వం కూడా జమ్ముకశ్మీర్‌పై చర్చలు జరపాలని మెహబూబా డిమాండ్ చేశారు.

జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఎంత ఓపిక వహించాలో అంత ఓపిక వహిస్తున్నారు. కాని వారి ఓపిక నశిస్తే మీరు కూడా (కేంద్ర ప్రభుత్వ పెద్దలు) ఉండరు. నష్టపోతారు. మా ఓపికను తేలికగా తీసుకోవద్దని నేను పదే పదే చెబుతున్నాను. ఇప్పటికైనా మారండి. అర్థం చేసుకోండి. పొరుగు దేశంలో (అఫ్గనిస్థాన్​‌లో) ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. బలమైన అమెరికా కూడా అక్కడి నుంచి పెట్టా బేడా సర్దుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది. చట్ట విరుద్ధంగా జమ్ముకశ్మీర్‌ను ఏ విధంగా ముక్కలు చేశారో, ఆ తప్పును సరిదిద్దండి. మీకు(కేంద్రానికి) ఇంకా అవకాశం ఉంది. వాజ్‌పేయీ ఎలాగైతే జమ్మూకశ్మీర్‌పై చర్చలు జరిపారో అలాగే మీరు(కేంద్రం) కూడా చర్చల ప్రక్రియను ప్రారంభించాలి.

-మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి

ఆ సత్తా భారత్​కు​ ఉంది..

జమ్ముకశ్మీర్‌ను ప్రస్తుత అఫ్గానిస్థాన్‌తో పోలుస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా తప్పుపట్టింది. భారత్‌ ఓ శక్తిమంతమైన దేశమన్న భాజపా జమ్ముకశ్మీర్‌ అధ్యక్షుడు రవీందర్‌ రైనా.. దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడేందుకు తాలిబన్‌, అల్‌ఖైదా, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌ వంటి తీవ్రవాద సంస్థలను నాశనం చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని అన్నారు. దేశానికి వ్యతిరేకంగా మెహబూబా ముఫ్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న రవీందర్‌ రైనా..కానీ కశ్మీర్‌ ప్రజలు మాత్రం దేశభక్తులుగా జాతీయ జెండాను ఎగురేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: Taliban news: తాలిబన్లలకు మద్దతుగా పోస్టులు.. 14 మంది అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.