ETV Bharat / bharat

Longest Train In India : 7రాష్ట్రాలు.. 4వేల కి.మీ.. 75గంటలు.. దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇదే.. - india longest train name

Longest Train In India : దేశంలో అత్యంత సుదీర్ఘ దూరం ప్రయాణించే రైలుగా వివేక్ ఎక్స్​ప్రెస్ రికార్డు సాధించింది. మరి ఈ రైలు ఎన్ని రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది? ఎన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది? బోగీల వివరాలేంటో ఓ సారి తెలుసుకుందాం.

Longest Train In India
Longest Train In India
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 5:45 PM IST

Longest Train In India : వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌.. భారతీయ రైల్వేలో అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే రైలు. అసోంలోని డిబ్రుఘడ్‌- తమిళనాడులోని కన్యాకుమారి మధ్య ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్య దూరం 4,152 కిలోమీటర్లు. దేశంలోనే అత్యంత దూరం ప్రయాణించే రైలుగా వివేక్ ఎక్స్​ప్రెస్ రికార్డు సృష్టించింది. అసోం, బంగాల్​, ఏపీ, తమిళనాడు సహా ఏడు రాష్ట్రాల్లో 75 గంటలు ప్రయాణించి ఈ రైలు గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. వివేక్ ఎక్స్​ప్రెస్ మరికొన్ని ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం.

Longest Train Journey In India : మొదట్లో వారానికి రెండు సార్లు మాత్రమే నడిచే వివేక్ ఎక్స్​ప్రెస్​.. ప్రస్తుతం ఆదివారం, మంగళవారం, గురువారం, శనివారం నడుస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులు మరింతగా వివేక్ ఎక్స్​ప్రెస్​లో ప్రయాణిస్తున్నారు. దిబ్రుగఢ్​లోని బనిపుర్ స్టేషన్‌లో రాత్రి 7 గంటల 25 నిమిషాలకు వివేక్ ఎక్స్​ప్రెస్ బయలుదేరుతుంది. 75 గంటల ప్రయాణించి భారతదేశ దక్షిణ కొన అయిన కన్యాకుమారికి రాత్రి ఎనిమిది గంటలకు చేరుకుంటుంది. మళ్లీ మరుసటి రోజు సాయంత్రం 5:20కి ప్రారంభమై 75 గంటల ప్రయాణం తర్వాత దిబ్రుగఢ్​కు చేరుకుంటుంది. ఈ సుదూర ప్రయాణంలో 58 రైల్వే స్టేషన్​లలో వివేక్ ఎక్స్​ప్రెస్ ఆగుతుంది. వివేక్​ ఎక్స్​ప్రెస్​లో 2 AC, 3AC, స్లీపర్, జనరల్ బోగీలు ఉన్నాయి. ఒక ప్యాంట్రీ కారు, లగేజ్ బోగీ కూడా ఉంది.

Vivek Express Wikipedia : కాగా.. దేశంలోనే అత్యధిక దూరం ప్రయాణించే రైలుగా వివేక్​ ఎక్స్​ప్రెస్ నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు ఈశాన్య సరిహద్దు రైల్వే(ఎన్​ఈఎఫ్ఆర్​) జోనల్ మేనేజర్ ఉత్తమ్ ప్రకాశ్. వివేక్ ఎక్స్​ప్రెస్ సమర్థంగా ప్రయాణికులు సేవలు అందిస్తుందని ఆయన కొనియాడారు.

వివేక్ ఎక్స్​ప్రెస్ రైలు గురించి 2011-12 రైల్వే బడ్జెట్‌లో అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు. 2013లో స్వామి వివేకానంద 150 జయంతి సందర్భంగా జనవరి 12న ఈ రైళ్లను పచ్చాజెండా ఊపి ప్రారంభించారు. నిర్విరామంగా రాకపోకలు సాగిస్తున్న ఈ రైలు సర్వీసుకు కొవిడ్​ సమయంలో బ్రేక్‌ పడింది. కొవిడ్​ లాక్​డౌన్ నేపథ్యంలో రైల్వేశాఖ అన్ని రైళ్ల సర్వీసులను నిలిపివేసింది. అలా నిలిచిపోయిన ఆఖరి రైలు వివేక్‌ ఎక్స్‌ప్రెసే కావడం గమనార్హం.

Railway General Ticket Rules : ఒక ట్రైన్​ జనరల్​ టికెట్​తో మరో రైలులో ప్రయాణించొచ్చా? రూల్స్​ ఏం చెబుతున్నాయి?

కోర్బా చేరుకున్న దేశంలోనే అతి పొడవైన రైలు

మళ్లీ ట్రాక్​ ఎక్కిన 115 ఏళ్ల నాటి స్టీమ్​ రైలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.