ETV Bharat / bharat

పార్లమెంటు ఉభయసభలు సోమవారానికి వాయిదా - పార్లమెంట్ న్యూస్​

parliament adjourned amid oppisiopn leaders protest demanding discussion on pegasus issue
పార్లమెంటు వాయిదా
author img

By

Published : Jul 23, 2021, 11:24 AM IST

Updated : Jul 23, 2021, 2:40 PM IST

14:39 July 23

విపక్షాల ఆందోళనలు కొనసాగగా... రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. 

12:35 July 23

రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ మూడోసారి మధ్యాహ్నం 2:30 గంటల వరకు వాయిదా పడింది. సస్పెన్షన్​కు గురైన టీఎంసీ ఎంపీ శంతను సేన్​ సభను వీడకుండా ఆందోళనలు కొనసాగించడం వల్ల డిప్యూటీ ఛైర్మన్​ ఈ నిర్ణయం తీసుకున్నారు.

12:22 July 23

లోక్​సభ సోమవారానికి వాయిదా

లోక్​సభ సోమవారానికి వాయిదా పడింది. పెగాసస్ వ్యవహారంపై విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

12:07 July 23

వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. సస్పెండ్ అయిన టీఎంసీ ఎంపీ శంతను సేన్ సభను వీడకుండా నినాదాలు చేశారు. దీంతో సభ మరోమారు మధ్యాహ్నం 12:30 గంటల వరకు వాయిదా పడింది.

11:05 July 23

పార్లమెంటు సమావేశాలు లైవ్ అప్​డేట్స్​

లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. పెగాసస్‌పై చర్చ చేపట్టాలని విపక్షసభ్యుల నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.

మరోవైపు రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. గురువారం ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ నుంచి పత్రాలు లాక్కొన్న టీఎంసీ ఎంపీ శంతను సేన్​ని సభ నుంచి సస్పెండ్ చేయాలని భాజపా తీర్మానం ప్రవేశ పెట్టగా అందుకు స్పీకర్ ఆమోదం తెలిపారు. దీంతో ఆయన ఈ వర్షకాల సమావేశాలకు దూరం కానున్నారు.

Last Updated : Jul 23, 2021, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.