ETV Bharat / bharat

Lokpal complaint: ఇక ఆన్‌లైన్‌లోనూ లోక్‌పాల్‌కు ఫిర్యాదులు

author img

By

Published : Dec 14, 2021, 7:14 AM IST

ఇకపై లోక్‌పాల్‌ ఫిర్యాదులను డిజిటల్‌ వేదిక ద్వారా కూడా దాఖలు చేయవచ్చు. భారతదేశ ప్రప్రథమ లోక్‌పాల్‌ జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ సోమవారం ఈ వేదికను ప్రారంభించారు.

Lokpal complaint
Lokpal complaint

Lokpal complaint: పాలకులు, ప్రభుత్వోద్యోగులపై అవినీతి ఆరోపణలను పౌరులు ఇక ఆన్‌లైన్‌లోనూ దాఖలు చేయవచ్చు. ఇంతవరకు తపాలా, ఈ-మెయిల్‌, వ్యక్తిగతంగా మాత్రమే లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేసే వీలు ఉండేది. ఇక నుంచి వారు లోక్‌పాల్‌ ఆన్‌లైన్‌ అనే డిజిటల్‌ వేదిక ద్వారా కూడా అవినీతి ఆరోపణలను దాఖలు చేయవచ్చు. భారతదేశ ప్రప్రథమ లోక్‌పాల్‌ జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ సోమవారం ఈ వేదికను ప్రారంభించారు. ఇకపై పౌరులు ఎక్కడ నుంచైనా, ఏ సమయంలోనైనా లోక్‌పాల్‌ ఆన్‌లైన్‌.గవ్‌.ఇన్​లో (lokpalonline.gov.in) తమ ఆరోపణలు నమోదు చేయవచ్చు.

ఫిర్యాదుదారుని పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతారు. కొత్తగా ప్రారంభమైన లోకాయుక్త ఆన్‌లైన్‌ పోర్టల్‌ గురించి పౌరులకు, ముఖ్యంగా గ్రామీణులకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తామని లోకాయుక్తలో న్యాయ సభ్యురాలైన జస్టిస్‌ అభిలాషా కుమారి చెప్పారు. లోక్‌పాల్‌ పోర్టల్‌కు ఫిర్యాదు పంపిన దగ్గర నుంచి అది పరిష్కారమయ్యే వరకు ప్రతి దశలో ఏం జరుగుతోందో ఫిర్యాదుదారునికి ఎప్పటికప్పుడు ఈ-మెయిల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తామని వివరించారు.

విచారణ పురోగతి గురించి పౌరునికి ప్రతి దశలో ఈ-మెయిల్స్‌ అందుతాయి. దర్యాప్తు సంస్థలనూ కేసు పురోగతి గురించి ఆన్‌లైన్‌ పద్ధతిలో వాకబు చేస్తామన్నారు. కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఇతర పరిశోధక సంస్థలు తమ నివేదికలను ఆన్‌లైన్‌లో సమర్పిస్తాయి.

ఇదీ చూడండి: 'జడ్జిల నియామకంలో మా పరిధి అతిక్రమించం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.