కొవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం తలెత్తకుండా ప్రజలు నిబంధనలు పాటించేలా చూడాలని, వైరస్ వ్యాప్తిపై వారికి అవగాహన పెంచాలని స్వచ్ఛంద సంస్థలను కోరారు లోక్ సభ్ స్పీకర్ ఓం బిర్లా. స్వచ్ఛంద సంస్థలు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తాయని పేర్కొన్నారు.
దక్షిణ దిల్లీకి చెందిన రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ఓం బిర్లా.. మహమ్మారి వ్యాప్తి ఇంకా ముగిసిపోలేదన్నారు. మూడో దశ ముప్పు తలెత్తకుండా ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత మన చేతుల్లోనే ఉందని తెలిపారు. కొవిడ్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని స్పచ్ఛంద సంస్థలను కోరారు.
"భవిష్యత్తుల్లో వచ్చే విపత్తులను ధైర్యంగా ఎదుర్కునేందుకు సిద్ధమవ్వాలి. పట్టణాలు, టౌన్లలోనూ ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరుచుకోవాలి. రోటరీ క్లబ్ వంటి సంస్థలు.. మారుమూల ప్రాంతాల్లోనూ ఆరోగ్య వసతులు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలి. స్వచ్ఛంద సంస్థలు, ఇతర వర్గాలు.. ప్రభుత్వానికి తోడుగా ఉంటేనే మహమ్మారిని జయించగలం."
--ఓం బిర్లా, లోక్సభ్ స్పీకర్.
వీలైతే కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని, మురికివాడలో నివసించే వారికి ఉపాధి కల్పించాలని రోటరీ క్లబ్ వ్యవస్థాపకుడు అనిల్ కే అగర్వాల్‌ను కోరారు ఓం బిర్లా.
ఇదీ చదవండి:Zika virus: కేరళలో మరో ఐదుగురికి జికా వైరస్