ETV Bharat / bharat

'ఈనెల 19 నుంచి పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు'

author img

By

Published : Jul 12, 2021, 2:59 PM IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై స్పీకర్​ ఓం బిర్లా సోమవారం ప్రకటన చేశారు. జులై 19 నుంచి ప్రారంభం అయ్యే ఈ సమావేశాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉభయసభల్లో కార్యకలాపాలు జరుగుతాయని తెలిపారు.

lok sabha speaker om birla
వర్షాకాల సమావేశాలు : 'ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం'

జులై 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయని లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా వెల్లడించారు. ఆగస్టు 13 వరకు సాగే ఈ సమావేశాల్లో ఉభయ సభలు ప్రతి రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. సమావేశాల ఏర్పాట్లపై ఆరా తీశారు.

ఎంపీలు, మీడియా, సిబ్బంది కొవిడ్​ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు స్పీకర్​. వ్యాక్సిన్​ తీసుకున్న వారు ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. టీకా తీసుకోని వారు మాత్రం పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.

ఇప్పటివరకు 323 మంది సభ్యులు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్​ తీసుకున్నారని, 23 మంది ఆరోగ్య సమస్యల కారణంగా తొలి డోసు కూడా తీసుకోలేదని స్పీకర్​ వెల్లడించారు.

ఇదీ చదవండి : Rath Yatra:నిరాడంబరంగా 'జగన్నాథ' రథయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.