ETV Bharat / bharat

4 నెలల తర్వాత లోక్​సభకు రాహుల్​.. స్వాగతం పలికిన 'ఇండియా' కూటమి నేతలు - పార్లమెంట్​కు వచ్చిన రాహుల్ గాంధీ

Rahul Gandhi Lok Sabha Membership : లోక్​సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం వల్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్​కు హాజరయ్యారు. ఆయన విపక్ష కూటమి ఎంపీలు స్వాగతం పలికారు. రాహుల్​ లోక్​సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సత్యం, న్యాయం సాధించిన విజయమని కాంగ్రెస్ నేతలు అన్నారు.

Rahul Gandhi Lok Sabha Membership
Rahul Gandhi Lok Sabha Membership
author img

By

Published : Aug 7, 2023, 1:13 PM IST

Updated : Aug 7, 2023, 1:41 PM IST

Rahul Gandhi Lok Sabha Membership : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోమవారం పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు స్టేతో పార్లమెంటు సభ్యత్వాన్ని లోక్​సభ సచివాలయం పునరుద్ధరించిన నేపథ్యంలో.. నాలుగు నెలల తర్వాత తొలిసారి రాహుల్‌ గాంధీ సోమవారం సభకు వచ్చారు. సభలోకి వచ్చేముందు ఆయన పార్లమెంట్‌ ప్రాంగణంలోని మహత్ముడి విగ్రహానికి నివాళి అర్పించారు. కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయన్ను సాదరంగా పార్లమెంట్​లోని ఆహ్వానించారు. రాహుల్​కు అనుకూలంగా నినాదాలు చేశారు.

  • #WATCH | Delhi: I.N.D.I.A alliance leaders raise slogans in favour of Congress leader Rahul Gandhi and the opposition alliance.

    Lok Sabha Secretariat today restored Rahul Gandhi's Lok Sabha membership after Supreme Court stayed his conviction in the ‘Modi’ surname remark case. pic.twitter.com/UgCZEtK0x4

    — ANI (@ANI) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | Congress MP Rahul Gandhi pays tributes to Mahatma Gandhi at the Parliament House.

    Lok Sabha Secretariat restored Rahul Gandhi's Lok Sabha membership today after Supreme Court stayed his conviction in the ‘Modi’ surname remark case. pic.twitter.com/jU9bWXG6UL

'సత్యం, న్యాయం సాధించిన విజయం'
రాహుల్ లోక్​సభ సభ్యత్వం పునరుద్ధరణను సత్యం, న్యాయం సాధించిన విజయంగా అభివర్ణించారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కించపరచడానికి బదులు పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యం గెలిచింది.. భారత్ గెలుస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. పార్లమెంట్​లో దేశ గొంతుకను రాహుల్ గాంధీ వినిపిస్తారని.. నిశబ్దంగా ఉండరని తెలిపారు.

  • Democracy has won! India wins!

    Sh. @RahulGandhi ji will continue his parliamentary journey by speaking the truth without any hesitation.

    He is the voice of India, he can never be silenced. pic.twitter.com/HRWljA9Nae

    — K C Venugopal (@kcvenugopalmp) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'స్టే మాత్రమే విధించింది'
రాహుల్ గాంధీ లోక్​సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ స్పందించారు. 'పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే మాత్రమే విధించింది. అప్పీలు ఇప్పటికీ కోర్టులో పెండింగ్​లో ఉంది. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ వల్ల కాంగ్రెస్​పార్టీకి పెద్దగా లాభమేమీ ఉండదు.' అని అన్నారు. 'దేశ అత్యున్నత అత్యున్నత న్యాయస్థానం పరువు నష్టం కేసులో కొన్నాళ్లపాటు స్టే విధించింది. అయితే.. రాహుల్ గాంధీ తనను తాను నిర్దోషిగా ప్రకటించుకోవడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యానికి అవమానకరం' అని కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ విమర్శించారు.

  • #WATCH | Delhi: On restoration of Rahul Gandhi's Lok Sabha membership, BJP leader Sushil Modi says, "He (Rahul Gandhi) is still not 'blame free', only his conviction has been stayed. His appeal is still pending in court...This is a common procedure...The Supreme Court has also… pic.twitter.com/q3dsW545HB

  • #WATCH | ..." Top court has stayed the conviction for few days but celebrating this verdict as his (Rahul Gandhi's) acquittal is unfortunate and an insult to democracy", says Union Minister Gajendra Singh Shekhawat pic.twitter.com/YSbUEBy3oZ

శివసేన స్పందన..
రాహుల్​ గాంధీ లోక్​సభ సభ్యత్వాన్ని పునురుద్ధరించడంపై శివసేన(ఉద్ధవ్​ వర్గం) స్వాగతించింది. ' దేశంలో స్వేచ్ఛ ప్రమాదంలో ఉంది. రాహుల్ గాంధీ తిరిగి లోక్‌సభకు రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. పరువునష్టం కేసులో సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి గట్టి చెంపదెబ్బ లాంటిది.' అని శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ అరవింద్ సావంత్ వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ బయో మార్చిన రాహుల్ గాంధీ..
Rahul Gandhi Twitter Bio Change : లోక్​సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీ తన ట్విట్టర్​ బయోలో మార్పు చేశారు. ఇంతకాలం 'డిస్‌క్వాలిఫైడ్ ఎంపీ'గా ఉన్న స్థానంలో మెంబర్‌ ఆఫ్ పార్లమెంట్‌గా మార్చుకున్నారు.

  • Congress leader Rahul Gandhi updates his Twitter account bio from 'Dis'Qualified MP' to 'Member of Parliament' after Lok Sabha Secretariat restored his membership today.

    Supreme Court on Friday (August 4) stayed his conviction in the ‘Modi’ surname remark case. pic.twitter.com/ehQjMywEms

పార్లమెంట్​కు రాహుల్​ రీఎంట్రీ.. అనర్హత ఎత్తివేసిన లోక్‌సభ

'అప్పుడు 24 గంటల్లోనే రాహుల్​పై అనర్హత.. ఇప్పుడు సభ్యత్వం పునరుద్ధరణకు ఎంత సమయం?'

Last Updated : Aug 7, 2023, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.