ETV Bharat / bharat

రాజ్​నాథ్​​ వినతితో సజావుగా సాగిన లోక్​సభ - loksabha monday

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఆమోదించడం.. లోక్​సభ సంప్రదాయం అని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ చేసిన వినతితో లోక్​ సభ సజావుగా సాగింది. ఆ తీర్మాన సమయంలో సాగు చట్టాలపై సభ్యులు చర్చించవచ్చని ఆయన తెలిపారు.

Lok Sabha
రాజ్​నాథ్​ సింగ్​ వినతితో సజావుగా సాగిన లోక్​సభ
author img

By

Published : Feb 8, 2021, 7:37 PM IST

నూతన సాగు చట్టాలపై చర్చించాలన్న విపక్షాల డిమాండ్​తో వారం రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన లోక్​సభ.. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వినతితో సోమవారం సాధారణ పనితీరును కనబర్చింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం సంప్రదాయం అని.. దానిని కొనసాగించే బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందని రాజ్​నాథ్​ సింగ్​ అంతకుముందు విజ్ఞప్తి చేశారు.

10 నిమిషాల్లోనే వాయిదా..

సోమవారం కూడా లోక్​సభ సమావేశమైన పది నిమిషాలకే వాయిదా పడింది. సాయంత్రం 5 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత.. రాజ్​నాథ్​ సింగ్ మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిందని గుర్తుచేశారు. లోక్​సభలో ఆ సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయవద్దని కోరారు. ఈ తీర్మాన సమయంలో సాగు చట్టాల గురించి సభ్యులు మాట్లాడవచ్చని తెలిపారు.

ప్రభుత్వం ఆ హామీ ఇవ్వాలి..

ధన్యవాద తీర్మాన సంప్రదాయం 1921 నుంచి కొనసాగుతోందని లోక్​సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. అయితే.. దిల్లీలోకి ప్రవేశించకుండా రైతులను అడ్డుకుంటున్నారని, రోడ్లపై మేకులు కొడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో సాగు చట్టాలపై చర్చించాలనేదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. ధన్యవాద తీర్మానం అనంతరం లేదా బడ్జెట్​పై చర్చ తర్వాతనైనా సాగు చట్టాలపై చర్చించేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు.

​ఆహ్వానం.. అంగీకారం

సభా కార్యకలాపాలకు అడ్డుపడవద్దని, నినాదాలు చేయవద్దని సభ్యులకు లోక్​ సభ స్పీకర్​ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు. సమావేశాల్లో నెలకొన్న అనిశ్చితిని తొలగించే దిశగా.. అంతకుముందు ఆయన వివిధ పార్టీ నేతలను భేటీకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో, రాష్ట్రపతి ప్రసంగంపై చర్చను ప్రారంభించాలని రాజ్​ నాథ్​ సింగ్​ విజ్ఞప్తి చేశారు. దీంతో సాధారణ పనితీరును తిరిగి ప్రారంభించడానికి సభ్యులు అంగీకరించారు.

ఇదీ చదవండి:చర్చలకు సిద్ధం.. తేదీ చెప్పండి: రైతు నేతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.