పార్లమెంటు బడ్జెట్ తొలివిడత సమావేశాలు ముగిశాయి. శనివారం నాడు లోక్‌సభ సమావేశాలు వచ్చేనెల 8కి వాయిదాపడ్డాయి. పార్లమెంటు రెండోవిడత బడ్జెట్ సమావేశాలు మార్చి 8న ప్రారంభమై..
ఏప్రిల్ 8న ముగియనున్నాయి. సాధారణంగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో నిర్వహిస్తారు. తొలిదశలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం, వార్షిక బడ్జెట్ సమర్పణ ఉంటుంది. రెండో విడతలో కేంద్రమంత్రిత్వ శాఖలకు సంబంధించిన నిధుల డిమాండ్లపై విభాగాలవారీగా స్టాండింగ్ కమిటీలు పరిశీలిస్తాయి. ఇంకా ఆర్థిక బిల్లు, నిధుల విడుదలకు సంబంధించి డిమాండ్లపై చర్చ జరగనుంది.
ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం