ETV Bharat / bharat

10 ఎకరాల టమోటా పంటకు నిప్పు పెట్టిన రైతు - గిట్టుబాటు ధర లేనందున 10 ఎకరాల టమోటా పంటకు నిప్పు

టమోటా రైతులకు ధరలు లేక కన్నీరే మిగులుతోంది. పెట్టుబడి సైతం రాని క్రమంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు కర్ణాటకకు చెందిన ఓ రైతు. తాను సాగు చేసిన 10 ఎకరాల టమోటా పంటకు నిప్పంటించాడు.

Farmer fire to tomato crop
రైతు, పంటకు నిప్పు
author img

By

Published : May 22, 2021, 4:04 PM IST

Updated : May 22, 2021, 5:21 PM IST

టమోటా సాగు చేసిన రైతులు దిగుబడి చూసి సంతోషించే లోపే.. ధరలు పడిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. కిలో టమోటాకు రెండు, మూడు రూపాయలు కూడా పలకటం లేదు. కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితులు తలెత్తాయి. కరోనా సంక్షోభంతో కొనేవారే కరువయ్యారు. ఈ క్రమంలో నిరాశకు గురైన ఓ రైతు తాను సాగు చేసిన 10 ఎకరాల టమోటా పంటకు నిప్పంటించాడు. ఈ సంఘటన కర్ణాటక, బెంగళూరు సమీపంలోని గ్రామంలో జరిగింది.

గిట్టుబాటు ధర లేనందున టమోటా పంటకు నిప్పంటించిన రైతు

బెంగళూరు నేలమంగళ సమీపంలోని ఖాజీపాల్య, కుట్టినాగెరే ప్రాంతాల్లోని రైతులు ఈ సారి భారీ ఎత్తున టమోటా సాగు చేశారు. ఈ నేపథ్యంలో మారి గౌడ అనే ఓ రైతు 10ఎకరాలను కౌలుకు తీసుకుని టమోటా పంట సాగు చేశాడు. మధ్యవర్తులు అన్నదాత వద్ద నుంచి కిలో టమోటాను రూ.5కు కొని, మార్కెట్​లో రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మారిగౌడ.. తన 10 ఎకరాల్లో పండించిన టమోటా పంటకు నిప్పంటించాడు.

ఎన్నో ఆశలు పెట్టుకుని పండించిన పంటకు గిట్టుబాటు ధర రానందువల్లే.. ఇలా తగులబెట్టినట్టు మారిగౌడ ఆవేదన వ్యక్తం చేశారు.

"వివాహ వేడుకలు ఉన్నందున టమోటా పంటకు మంచి ధర లభిస్తుందనే ఆశతో నేను 10 ఎకరాలను లీజుకు తీసుకున్నాను. అయితే.. లాక్​డౌన్​ కారణంతో ధరలు తగ్గడం వల్ల తీవ్ర ఆందోళన చెందాను. చేసేదేమీ లేక పంట మొత్తాన్ని తగులబెట్టేశాను."

- మారిగౌడ, రైతు

ఈ నేపథ్యంలో.. తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు మరికొందరు రైతులు. ప్రభుత్వం మా నుంచి నేరుగా టమోటాలు కొనాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి: కొండ ప్రాంతాల్లో బైక్​ రైడింగ్​తో అంతర్జాతీయ గుర్తింపు

Last Updated : May 22, 2021, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.