ETV Bharat / bharat

ఆన్‌లైన్‌ యమపాశాలుగా మారిన రుణ యాప్​లు - ఆర్​బీఐ ప్రకటనలు

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు చాలా మంది రుణ యాప్​ల పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పు సమానార్థకాన్ని ముప్పుగా స్థిరీకరిస్తూ దేశంలో రుణ యాప్‌లెన్నో పోటాపోటీగా మృత్యుపాశాలు విసురుతున్నాయి. దీనిపై స్పందించిన ఆర్​బీఐ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. అమాయకులుతో మృత్యుక్రీడలాడేవారిని ఏ మాత్రం సహించేదిలేదని స్పష్టం చేసింది.

loan apps with high interest threaten many people amid pandemic period
ఆన్‌లైన్‌ యమపాశాలుగా మారిన రుణ యాప్​లు
author img

By

Published : Dec 27, 2020, 8:37 AM IST

కొవిడ్‌ మహాసంక్షోభం కారణంగా అసంఖ్యాకులకు ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోయి కోట్లమంది దారిద్య్రరేఖ దిగువకు జారిపోయారు. ఉన్నట్టుండి చుట్టుముట్టిన ఆర్థిక క్లేశాల నుంచి గట్టెక్కేందుకు ఏ కాస్త ఆసరా కనిపించినా అందిపుచ్చుకోవాలని ఆరాటపడేవారెందరో సహజంగానే రుణ యాప్‌ల పట్ల ఆకర్షితులవుతున్నారు. అంతిమంగా ప్రాణం పైకి తెచ్చుకుంటున్నారు. అమాయకులతో మృత్యుక్రీడలాడేవారిని ఎంతమాత్రం సహించేది లేదంటూ విస్పష్ట కార్యాచరణతో ముందడుగు వేయాల్సిన రిజర్వ్‌బ్యాంక్‌ తాజాగా ఒక ప్రకటన జారీచేసింది.

డిజిటల్‌ రుణాలు దయ చేస్తామనే యాప్‌ల ఉచ్చులో జనం చిక్కుకోరాదని ఉద్బోధించిన ఆర్‌బీఐ- అనధికారిక వ్యక్తులెవరైనా బ్యాంకు ఖాతా, ఆధార్‌ తదితర వివరాలు అడిగితే తమకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించింది. ఏయే సంస్థలు, ఎవరెవరు అనధికారిక జాబితాలో చేరతారో తెలియని సాధారణ పౌరులు తమను తాము కాపాడుకోవడమన్నది సాధ్యమేనా? కొంతమంది పట్టభద్రులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సైతం రుణ యాప్‌ల పట్ల ఆకర్షితులై సాలెగూట్లో చిక్కిన కీటకాల్లా విలవిల్లాడుతున్న దశలో 'పారాహుషార్‌!' హెచ్చరికలా... రిజర్వ్‌బ్యాంక్‌ చేయాల్సింది?

కేరళకు చెందిన ఒక వ్యాపారికి చెన్నై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యాప్‌ ఆధారిత రుణసంస్థ నుంచి ఆరు రోజుల్లో తిరిగి చెల్లించాలన్న షరతుపై రూ.35 వేల అప్పు మంజూరైంది. వ్యవధిలోగా రూ.47 వేల మొత్తం చెల్లించడంలో విఫలమైన అతడు కొత్త అప్పు కోసం మరో యాప్‌ను ఆశ్రయించాడు. 16 వారాల వ్యవధిలో రుణం మీద రుణం పెరిగి బాకీ అయిదు లక్షల అరవై వేల రూపాయలకు ఎగబాకింది. అతగాడు చివరికి రూ.7,60,000 చెల్లించాల్సి వచ్చింది.

ఆశ చూపి...

కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్‌ రుణం వచ్చి పడుతుందని విశ్వసించి, త్వరలోనే తీర్చేయగలమన్న ధీమాతో అప్పు తీసుకుని ఆపై నిలువునా ఊబిలో కూరుకుపోతున్న అభాగ్యుల దీనావస్థకిది మచ్చుతునక. రూ.35వేల సర్దుబాటు కోసం కడకు ఏడున్నర లక్షల రూపాయలకు పైగా కక్కాల్సి వచ్చిన ఆ వ్యాపారి 'బతుకు జీవుడా!' అంటూ కొస ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇటీవలే రాచకొండ సైబర్‌ నేర విభాగాన్ని ఆశ్రయించిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుదీ దిగ్భ్రాంతపరచే అనుభవమే. 24 యాప్‌లలో మూడులక్షల రూపాయల రుణం తీసుకుని నానా తిప్పలూ పడి ఎనిమిది లక్షల రూపాయల దాకా చెల్లించినా ఇంకా మరో రూ.11లక్షలు కట్టాలని తనను బెదిరిస్తున్నట్లు అతడు వాపోయేసరికి, బిత్తరపోవడం పోలీసు సిబ్బంది వంతు అయింది! సులభంగా రుణాలు మంజూరు చేస్తారన్న ఆశతో ఆన్‌లైన్‌ సంస్థలతో లావాదేవీకి సిద్ధపడటమే పాపమై అధిక వడ్డీతో అప్పు తడిసి మోపెడై విషవలయంలో కూరుకుపోతున్న వారు ఎందరో ఉన్నారు.

కొంతమంది ఎలాగో ఒకలాగా నిర్ణీత వ్యవధిలో రుణం చెల్లించేసినా, ప్రత్యేక ఆఫర్ల పేరిట వారిని బులిపిస్తూ మరిన్ని యాప్‌లను పరిచయం చేసి కొత్త అప్పుల ఎర వేస్తున్న ఉదంతాలూ వెలుగు చూస్తున్నాయి. గడువు తీరిన క్షణం నుంచి వేధింపులు, దుర్భాషల తంతు మొదలైపోతుంది. అసభ్య పదజాలంతో పడతిట్టిపోస్తూ ఒక్క రోజులోనే వందలసార్లు ఫోన్‌ చేసి, చరవాణిలో సంక్షిప్త సందేశాలు వరసగా గుప్పించి తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తారు.

రుణగ్రహీతల చరవాణిలోని సమస్త సమాచారాన్నీ గుప్పిట పట్టి కుటుంబ సభ్యులకు పరిచయస్తులకు సైతం ఫోన్లు చేసి చెప్పరాని భాషలో తిట్ల పురాణం విప్పుతారు. వాట్సాప్‌ బృందాల్లో- ఫలానా వ్యక్తి రుణం తీసుకుని ఎగ్గొట్టాడంటూ పెద్దయెత్తున ప్రచారం చేస్తారు. లీగల్‌ నోటీసులు పంపిస్తామన్న బెదిరింపులు, తప్పుడు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లతో హడలెత్తించే పద్ధతులూ ఆ ముఠాలకు కొట్టిన పిండి. ఈ ఘోర అవమానం భరించలేక, నలుగురిలో తిరిగి తలెత్తుకోలేమన్న మానసిక ఆవేదనతో ఆత్మహత్యకు తెగబడుతున్న విషాద ఉదంతాలు పదుల సంఖ్యలో నమోదు కావడం నిశ్చేష్టపరుస్తోంది.

భారత్​లోనే అధికంగా..

ఈ ఏడాది ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇలా ఆన్‌లైన్‌లో తక్షణ రుణాలు ఇచ్చి- భారీ వడ్డీ ఇతరత్రా ఛార్జీలు రుద్ది ముక్కు పిండి వసూలు చేసే క్రమంలో నక్షత్రకాంశతో కిరాతకంగా పీడించే యాప్‌లు ... భారత్‌లోనే అధికంగా చలామణీలో ఉన్నట్లు గణాంకాలు చాటుతున్నాయి. క్యాష్‌బీన్‌, మనీమోర్‌, క్యాష్‌మామా, ఐ క్రెడిట్‌, హ్యాపీలోన్‌, ఐరుపీ, క్యాష్‌బస్‌ తదితర నామధేయాలతో విద్యార్థులకు, చిన్నాచితకా వ్యాపారులకు, ముఖ్యంగా 20-40 ఏళ్ల వయస్కులకు వలేస్తున్న రుణయాప్‌లు వందల సంఖ్యలో పుట్టుకొచ్చాయంటున్నారు. విపరీత వేధింపులు తాళలేని కొందరి ఆత్మహత్యలు, ఫిర్యాదులు వెల్లువెత్తి పదుల సంఖ్యలో కేసుల నమోదు దరిమిలా- ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, అసోంలాంటి చోట్లా పోలీస్‌ దర్యాప్తులు మొదలయ్యాయి. దిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్‌ కేంద్రాలుగా చక్రం తిప్పుతున్న కాల్‌సెంటర్లపై దాడుల్లో కీలక దస్త్రాలు పట్టుబడ్డాయి. పోలీసు బృందాలు ఇప్పటికే కొందర్ని అదుపులోకి తీసుకున్నా- అసలు సూత్రధారుల కూసాలు కదిలేదెప్పుడో మరి!

పది పన్నెండేళ్ల క్రితం దేశంలో పప్పుబెల్లాల్లా అప్పుల పందేరం సాగించిన సూక్ష్మరుణ (మైక్రోఫైనాన్స్‌) సంస్థలు తామిచ్చిన దానికి ఎన్నో రెట్లు వడ్డీగా దండుకుంటూ, 'లబ్ధిదారుల'పై ప్రాణాంతక ఒత్తిడి పెంచడం చాలామందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ అమానుష వేధింపులు తట్టుకోలేక తెలుగు నేలపైనే ఎనభైకిపైగా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రుణాలిచ్చి వసూలు చేసే సిబ్బంది పరమ రాక్షసంగా వ్యవహరిస్తే పర్యవసానాలు ఎంత దారుణంగా ఉంటాయో నాడు అనుభవమైనా- యావద్దేశ బ్యాంకింగ్‌ క్రతువుకు ధర్మకర్తగా మెలగాల్సిన రిజర్వ్‌ బ్యాంక్‌ నేడు చేస్తున్నదేమిటి?

రుణాలిస్తామని వెంటపడే యాప్‌లలో చైనాకు చెందినవే ఎక్కువన్నది పోలీస్‌ ఉన్నతాధికారుల విశ్లేషణ. గూగుల్‌ ప్లేస్టోర్‌లో కనిపించే యాప్‌ ఏదైనా విధిగా తమ చిరునామా పొందుపరచి తీరాలి. పైగా అవి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లతో ఒప్పందం కుదుర్చుకుంటేనేగాని రుణాలిచ్చేందుకు వీల్లేదు. ఇష్టారాజ్యంగా వడ్డీ దండుకోవడం, రుణగ్రహీతలను అసభ్య పదజాలంతో దూషించడం, అప్పు తీసుకున్న వారిలో యువతులు ఉంటే సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర ప్రచారానికి ఒడిగట్టడం... ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమే అయినప్పుడు- రిజర్వ్‌బ్యాంక్‌, ప్రభుత్వాలు చురుగ్గా స్పందించనక్కరలేదా? రుణ యాప్‌ల ముఠాల భరతం పట్టడంలో మీనమేషాలు లెక్కిస్తే మరెన్నో బతుకులు నిస్సహాయంగా తెల్లారిపోతాయి. ఏమంటారు?

రచయిత- బాలు

ఇదీ చదవండి:ఔరా! గులకరాళ్లతో అద్భుత కళాఖండాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.