ETV Bharat / bharat

Chirag Paswan: చిరాగ్​​ను తప్పించే ప్లాన్​లో ఎల్​జేపీ ఎంపీలు! - LJP decline mps news

లోక్​జన శక్తి పార్టీ(ఎల్​జేపీ)కి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పార్టీ లోక్​సభాపక్ష నేతగా చిరాగ్​ పాసవాన్​ను(Chirag Paswan) తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాను కలిసిన వారు.. నూతన నేతగా పశుపతి కుమార్​ పరాస్​ను నియమించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

Chirag Paswan
చిరాగ్​ పాసవాన్​
author img

By

Published : Jun 14, 2021, 9:09 AM IST

Updated : Jun 14, 2021, 11:31 AM IST

లోక్​ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) లోక్​సభాపక్ష నేతగా చిరాగ్​ పాసవాన్(Chirag Paswan) ​ వైదొలగనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు.. పశుపతి కుమార్​ పరాస్​ను తమ కొత్త నేతగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బిహార్​లోని హాజీపుర్​ లోక్​సభ స్థానానికి పశుపతి కుమార్​ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

"ఎల్​జేపీకి చెందిన ఎంపీలు.. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాను ఆదివారం కలిశారు. తమ పార్టీలోని నూతన మార్పులకు సంబంధించి ఓ లేఖను ఆయనకు అందజేశారు. పశుపతి కుమార్​ను తమ కొత్తనేతగా వారు ఎన్నుకున్నారు." అని ఎల్​జేపీ వర్గాలు తెలిపాయి. మాజీ కేంద్ర మంత్రి రామ్​ విలాస్​ పాసవాన్​ మృతి అనంతరం.. ఆయన కుమారుడైన చిరాగ్​ పాసవాన్​(Chirag Paswan) పనితీరుపై ఎల్​జేపీ ఎంపీలు అసంతృప్తితో ఉన్నారని చెప్పాయి.

ఎల్​జేపీకి లోక్​సభలో ఆరుగురు ఎంపీలు ఉన్నారు. వారిలో ఐదుగురు ఎంపీలు పశుపతి పరాస్​ను తమ నూతన నేతగా ఎన్నుకున్నారు. ఎన్​డీఏ కూటమికి చెందిన ఎల్​జేపీలో తాజా పరిణామం.. బిహర్​ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

'చిరాగ్​ను వ్యతిరేకించను'

లోక్​సభ స్పీకర్​ ఆదేశించినప్పుడు వెళ్లి తాము ఆయనను కలుస్తామని పశుపతి కుమార్ పరాస్​ సోమవారం చెప్పారు. చిరాగ్​పాసవాన్​పై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు.

"ఎల్​జేపీలో ఆరుగురు ఎంపీలు ఉన్నారు. మా పార్టీని కాపాడాలని అందులో ఐదుగురు ఎంపీలు భావించారు. అందుకే నేను అంగీకరించాను. చిరాగ్​ పాసవాన్​ నాకు మేనల్లుడే కాదు.. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా. ఆయనపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు.

-పశుపతి కుమార్​ పరాస్​, ఎల్​జేపీ ఎంపీ

జేడీయూ నేతలను కలిశారా అని అడగగా పరాస్​ ఖండించారు. అలాంటిదేమీ లేదని చెప్పారు."ఎల్​జేపీ మా పార్టీ. బిహార్​లో మా పార్టీ చాలా బలంగా ఉంది. మేము ఎన్​డీఏలో భాగస్వామిగా ఉన్నాం. ఇకపై కూడా ఎన్​డీఏలోనే కొనసాగుతాం." అని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: చిరాగ్​ వేరుకుంపటే జేడీయూను ముంచిందా?

ఇదీ చూడండి: ఎల్జేపీ ఖాళీ- ఉన్న ఒక్క ఎమ్మెల్యే జేడీయూలో చేరిక

Last Updated : Jun 14, 2021, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.