లోక్‌జన్‌శక్తి పార్టీ ఎంపీ ప్రిన్స్ పాసవాన్‌పై(MP Prince Paswan) రేప్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకే ఆయనపై కేసు బుక్ చేసినట్లు దిల్లీ పోలీసులు మంగళవారం తెలిపారు.
'గురువారం అందిన కోర్టు ఆదేశాల మేరకు వివిధ సెక్షన్ల కింద ప్రిన్స్ పాసవాన్‌పై కాన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం' అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ప్రిన్స్ పాసవాన్(LJP MP Prince Paswan) బిహార్‌లోని సమస్తీపుర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: తగ్గుతున్న కరోనా వ్యాప్తి- దేశంలో కొత్తగా 25 వేల కేసులు