ETV Bharat / bharat

సహజీవనానికి దాంపత్య హక్కులు వర్తించవు: హైకోర్ట్​ - సహజీవనం పై మద్రాస్​ హైకోర్ట్​ తీర్పు

సుదీర్ఘకాలం పాటు సహజీవనం చేసిన వారికి చట్టపరమైన దాంపత్య హక్కులు (Conjugal Rights) వర్తించవని మద్రాస్​ హైకోర్ట్​ తీర్పు ఇచ్చింది. అలాంటి హక్కులు పొందాలంటే వారి వివాహం కచ్చితంగా న్యాయపరంగా జరిగి, నమోదై ఉండాలని స్పష్టం చేసింది.

Madras HC
మద్రాస్ హైకోర్ట్​
author img

By

Published : Nov 5, 2021, 7:20 PM IST

సుదీర్ఘకాలం సహజీవనం చేసినంత మాత్రాన ఏ ఇరువురికీ వివాహపరంగా ఎలాంటి న్యాయపరమైన హక్కులు వర్తించవని మద్రాస్​ హైకోర్ట్​ స్పష్టం చేసింది. దాంపత్య హక్కులు (Conjugal Rights) పొందాలి అంటే ఆ జంట కచ్చితంగా చట్టానికి లోబడి వివాహం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సహజీవనానికి సంబంధించిన ఎలాంటి వివాదాలు కుటుంబ న్యాయస్థానం పరిధిలోకి రావని జస్టిస్​ వైద్యానాథన్​, జస్టిస్ ఆర్​ విజయకుమార్​తో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.

తమిళనాడు కోయంబత్తూర్​కు చెందిన ఆర్​కళై సెల్వి అనే మహిళ 2013 నుంచి జోసెఫ్​ బేబీ అనే వ్యక్తితో సుదీర్ఘకాలం సహజీవనం చేశారు. తరువాత జోసెఫ్.. సెల్విని వదిలి వెళ్లిపోయారు. దీనిపై ఆమె విడాకులు చట్టంలోని సెక్షన్​ 32ను ఉటంకించి.. దాంపత్య హక్కులు కల్పించాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానంలో అప్పీలు చేశారు. ఆమె అభ్యర్థనను ఫ్యామిలీ కోర్ట్​ 2019 ఫిబ్రవరి 14 న కొట్టివేసింది. దీనిపై ఆమె మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించారు.

వాదనలు విన్న ధర్మాసనం.. ఫ్యామిలీ కోర్ట్​ ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తూ.. సెల్వి పిటిషన్​ను కొట్టేసింది. " ఇద్దరు వ్యక్తులు సుదీర్ఘకాలం కలిసి జీవించినంత మాత్రాన వారికి దాంపత్యహక్కులు రావు. అలాంటి వారు ఫ్యామిలీ కోర్టులను చట్టపరంగా ఆశ్రయించలేరు. దాంపత్య హక్కులు పొందాలి అంటే వారి వివాహం న్యాయపరంగా జరిగి ఉండాలి" అని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'గంగిరెద్దుకు క్యూఆర్​ కోడ్​.. ఇదీ డిజిటల్​ విప్లవం అంటే!'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.