దిల్లీలో రెండు ఆస్పత్రులు తమ వద్ద ఆక్సిజన్ నిల్వలు ఇంకా కొద్దిసేపు మాత్రమే వస్తాయని ప్రకటించాయి. సమయానికి ప్రాణవాయువు అందకపోతే.. పెను ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించాయి. మావియాలోని మధుకర్ రెయిన్బో పిల్లల ఆస్పత్రి ఆదివారం మధ్యాహ్నం.. తమ వద్ద ఆక్సిజన్ నిల్వలు క్షీణించాయని వెల్లడించింది. నలుగురు శిశువులు సహా 50 మంది ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొంది.
"నలుగురు చిన్నారులు సహా 50 మంది రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల ప్రతిరోజు మాకు ఇబ్బంది తలెత్తుతోంది. రోజుకు మాకు 125 ఆక్సిజన్ సిలిండర్లు అవసరం."
-రెయిన్బో పిల్లల ఆస్పత్రి అధికారి
అందకపోతే.. ప్రమాదమే..
దిల్లీలోని ట్రైటాన్ ఆస్పత్రి కూడా తమ వద్ద ఆక్సిజన్ నిల్వలు క్షీణించాయని తెలిపింది. ఐసీయూలో ఉన్న నవజాత శిశువులకు చికిత్స అందించటంలో తాము ఇబ్బంది పడుతున్నామని ట్రైటాన్ ఆస్పత్రికి చెందిన దీపాలి గుప్తా తెలిపారు. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరగకపోతే.. పెద్ద ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు.
పంపిస్తున్నాం..
అయితే.. దీనిపై ఆప్ ఎమ్మెల్యే రాఘవ చద్దా స్పందించారు. తాము ఈ రెండు ఆస్పత్రులకు రాజ్‌ఘాట్ విపత్తు కేంద్రం నుంచి ఐదు డి టైప్ ఆక్సిజన్ సిలిండర్లను పంపించామని చెప్పారు. దిల్లీకి ఆక్సిజన్ సరఫరా తగ్గడం వల్ల తమ ప్రభుత్వం వద్ద ప్రాణవాయువు నిల్వలు చాలా పరిమితంగా ఉన్నాయని పేర్కోన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి: కరోనాపై మోదీ సమీక్ష- నీట్ వాయిదాపై చర్చ!
ఇదీ చూడండి: ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న పీకే