ఎన్నికల శంఖారావం..
నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది ఎన్నికల సంఘం.
బంగాల్‌లో 8 విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. అసోంలో 3 దశల్లో నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికలు మార్చి 27న మొదలై.. 29న ముగియనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడించనున్నారు.
కరోనా నేపథ్యంలో.. ఈసీ పలు మార్గదర్శకాలను ప్రకటించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా ఎన్నికల తేదీలను ప్రకటించారు.
బంగాల్:
294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్‌లో 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6, ఏప్రిల్ 10, ఏప్రిల్ 17, ఏప్రిల్ 22, ఏప్రిల్ 26, ఏప్రిల్ 29 తేదీల్లో వరుసగా పోలింగ్ జరగనుంది.
అసోం:
ఈశాన్య రాష్ట్రం అసోంలో 126 స్థానాలకు 3 దశల్లో పోలింగ్ జరగనుంది.
మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
తమిళనాడు:
రాష్ట్రంలోని 234 స్థానాలకు ఒకే దశలో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది.
కేరళ:
కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు.
పుదుచ్చేరి:
ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఇక్కడ 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.