ETV Bharat / bharat

ఫిబ్రవరి 13 వరకే లోక్​సభ కార్యకలాపాలు - రైతుల చట్టాలు

పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు(తొలి భాగం) ఫిబ్రవరి 13నే ముగియనుంది. ఈ మేరకు లోక్​సభ సచివాలయ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

ఫిబ్రవరి 13 వరకే లోక్​సభ కార్యకలాపాలు
author img

By

Published : Feb 3, 2021, 5:15 AM IST

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్​ ప్రకారం కాకుండా.. రెండు రోజుల ముందుగానే లోక్​సభ కార్యకలాపాలు ముగియనున్నట్లు సచివాలయ కార్యాలయం తెలిపింది. పార్లమెంటు బడ్జెట్​ సమావేశాలు.. ఫిబ్రవరి 15 వరకు జరగాల్సి ఉండగా తాజా నిర్ణయంతో ఫిబ్రవరి 13నే(శనివారం) చివరిరోజు కానుంది.

దీనిపై ఫ్లోర్​ లీడర్లు అందరూ ఏకగ్రీవంగా సమ్మతి తెలిపారని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. ఫిబ్రవరి 13న ప్రశ్నోత్తరాల సమయం ఉండదని పేర్కొంది. అయితే శనివారం కూడా సభ నిర్వహణతో సిట్టింగుల సంఖ్యలో మార్పేమీ ఉండదని స్పష్టం చేసింది లోక్​సభ కార్యాలయం.

బడ్జెట్​ సెషన్​ జనవరి 29 నుంచి ఏప్రిల్​ 8 వరకు జరగనుంది. రెండో విడత సమావేశాలు మార్చి 8న ప్రారంభమవుతాయి.

రాజ్యసభ కార్యకలాపాలు కూడా ఫిబ్రవరి 13నే ముగించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'రక్షణ రంగ కేటాయింపుల్లో 60 ఏళ్ల రికార్డ్ రిపీట్!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.