నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వస్తోన్న కంటెంట్‌ను నియంత్రించే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. త్వరలో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కోర్టుకు విన్నవించింది.
వివిధ ఓటీటీ, స్ట్రీమింగ్, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్ పర్యవేక్షణ, నిర్వహణ కోసం ప్రభుత్వం బోర్డును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు శశాంక్ శేఖర్ ఝా, అపూర్వ ఆర్హటియా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో 6 వారాల్లోగా తెలియజేయాలని సూచించింది.