ETV Bharat / bharat

గూడ్స్​ రైలు ఢీకొని మృగరాజు మృతి - ​రైలు ఢీ కింద పడి చనిపోయిన సింహం

గుజరాత్​లోని అమ్రేలీ జిల్లాలో గూడ్స్​ రైలును ఢీకొట్టి ఓ మగ సింహం మరణించింది. చనిపోయిన సింహానికి సుమారు 5 నుంచి 6 ఏళ్లు ఉండొచ్చని అటవీ అధికారులు తెలిపారు.

Lion run over by train in Gujarat
మృగరాజు
author img

By

Published : Aug 22, 2021, 3:54 PM IST

Updated : Aug 22, 2021, 4:16 PM IST

గూడ్స్​ రైలు ఢీకొని మృగరాజు మృతి

గూడ్స్​ రైలు ఢీకొని ఓ సింహం చనిపోయింది. ఈ ఘటన గుజరాత్​లోని అమ్రేలీ జిల్లాలోని గిర్​ అటవీ ప్రాంతంలో ఉన్న ఖడ్కాల గ్రామ సమీపంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 9.30 ప్రాంతంలో ఈ ఘోరం జరిగి ఉండొచ్చని అటవీ అధికారి దుష్యంత్​ వాసవాడ చెప్పారు.

Lion run over by train in Gujarat
రైలు కిందపడి చనిపోయిన సింహం

చనిపోయిన సింహాన్ని మగదిగా గుర్తించిన అధికారులు.. సుమారు 5 నుంచి 6 ఏళ్లు ఉండొచ్చని పేర్కొన్నారు. పట్టాల పై ఉన్న మృతదేహాన్ని పరిశీలించిన అటవీ సిబ్బంది... అనంతరం శవపరీక్షకు తరలించారు.

Lion run over by train in Gujarat
మృగరాజు మృతదేహాన్ని తరలిస్తున్న అటవీ సిబ్బంది

2019-2020 మధ్య కాలంలో గుజరాత్​లో 313 సింహాలు చనిపోయాయి. 23 సింహాలు అసాధారణ కారణాలతో మరణించినట్లు ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి గణపత్​ వాసవ మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో చెప్పారు.

ఎక్కువ సింహాలు బావిలో పడి, వాహనాలు ఢీకొని, విద్యుదాఘాతంతో చనిపోయినట్లు పేర్కొన్నారు. మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: Drug smuggling: పొట్టలో రూ.11కోట్లు విలువైన కొకైన్​

Last Updated : Aug 22, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.