అకాల వర్షాలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. పిడుగుపాటుతో ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడగా.. చికిత్స పొందుతూ ఇప్పటికే నలుగురు మృతి చెందారు . మరో ముగ్గురు మృత్యువుతో పోరాడుతున్నారు.
ఇదీ జరిగింది..
ఈ నెల 21న చిక్కబల్లపురలో అకాల వర్షాలు కురిశాయి. ఈ సమయంలో అంబరీష్ అనే వ్యక్తి ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో అంబరీష్, అతని భార్య గాయిత్రమ్మ, పిల్లలు వనిశ్రీ, లావణ్య, దర్శన్, గౌతమ్‌లతో పాటు అతని తండ్రి జగన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేర్పించారు.
చికిత్స పొందుతూ.. గత ఆదివారం నుంచి రోజుకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు మొత్తం నలుగురు మరణించారు. చనిపోయిన వారిలో అంబరీష్ తండ్రి జగన్, కుమారుడు గౌతమ్, పెద్ద కుమార్తె వాణీశ్రీ, చిన్న కుమార్తె లావణ్య ఉన్నారు.
ఇదీ చూడండి: కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి!