ETV Bharat / bharat

'సైనికుల త్యాగానికి చిహ్నంగా దీపాన్ని వెలిగించండి'

దీపావళి పండుగ సందర్భంగా.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని సూచించారు.

PM_wishes
'సైనికుల త్యాగానికి చిహ్నంగా దీపాన్ని వెలిగించండి'
author img

By

Published : Nov 13, 2020, 10:00 PM IST

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సైనికుల త్యాగానికి చిహ్నంగా దీపాన్ని వెలగించాలని ప్రజలను కోరారు.

దేశ రక్షణకు సైనికులు చేస్తోన్న కృషి ఎనలేనిదని, మనం వెలిగించే ప్రతి దీపం వారికి వందనం చేసినట్లు అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సెల్యూట్ ​టు సోల్జర్స్​ అనే హాష్​ టాగ్​ ద్వారా ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టాలని కోరారు.

  • This Diwali, let us also light a Diya as a #Salute2Soldiers who fearlessly protect our nation. Words can’t do justice to the sense of gratitude we have for our soldiers for their exemplary courage. We are also grateful to the families of those on the borders. pic.twitter.com/UAKqPLvKR8

    — Narendra Modi (@narendramodi) November 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఐకమత్యానికి నిదర్శనం'

కాలుష్య రహితంగా దీపావళి పండుగ జరపాలని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ దేశ ప్రజలను కోరారు. కుల, మతాలకు అతీతంగా చేసుకునే ఈ పండుగ దేశ ఐకమత్యాన్ని సూచిస్తుందన్నారు.

'దీపావళి..మంచికి సంకేతం'

దీపావళి పండుగ మంచికి సంకేతమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వహిస్తూ దీపావళి పండుగ జరుపుకోవాలని దేశ ప్రజలను కోరారు. ఈ పండుగ చెడుపై గెలిచిన మంచికి సంకేతమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు నాయుడు.

ఇదీ చదవండి:మహా దీపోత్సవ వెలుగుల్లో పులకించిన అయోధ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.