ETV Bharat / bharat

'కశ్మీర్​లో 3 దశాబ్దాల తర్వాత సినిమా హాల్స్.. ఇకపై జిల్లాకో మాల్ పక్కా' - కశ్మిర్​లో ఐనోక్స్​ మాల్​

ఒకప్పుడు షూటింగ్లకు నెలవైన కశ్మీర్​లో ఉగ్రదాడుల కారణంగా మూతపడిన థియేటర్లు.. మూడు దశాబ్దాల తర్వాత ప్రారంభమయ్యాయి. పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన మల్టీపర్పస్ సినిమా హాళ్లను అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు.

INOX MALL IN KASHMIR
INOX MALL IN KASHMIR
author img

By

Published : Sep 18, 2022, 7:40 PM IST

INOX Mall In Kashmir : కశ్మీర్​లో మూడు దశాబ్దాల తర్వాత సినిమా హాల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫుల్వామా, షోపియాన్ ​ జిల్లాలలో ఆదివారం మల్టీపర్పస్ సినిమా హాళ్ల​ను ప్రారంభించారు జమ్ము కశ్మీర్​ లెప్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా. వీటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు. భవిష్యత్​లో జమ్ములోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్​ను నెలకొల్పుతామని సిన్హా పేర్కొన్నారు. సినిమాల ప్రదర్శనతో పాటు ఇన్ఫోటెయిన్​మెంట్, స్కిల్ డెవలప్​మెంట్ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మూడు దశాబ్దాల తర్వాత ప్రారంభమైన సినిమా హాళ్లు ఇవేనని చెప్పారు.

వీటితో పాటు వచ్చేవారం కశ్మీర్​లో తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. శ్రీనగర్​లోని సోమ్​వార్ ప్రాంతంలో దీన్ని తెరవనున్నారు. 520 సీట్ల సామర్థ్యం కలిగిన మూడు స్క్రీన్లు ఇందులో ఉండనున్నాయి. ఐనాక్స్ హాల్ ప్రారంభమైతే.. మూడు దశాబ్దాల తర్వాత కశ్మీర్‌లో నెలకొల్పిన మల్టీప్లెక్స్​గా ఇది రికార్డుకెక్కనుంది.

LG Sinha inaugurates cinema halls in Pulwama
మాల్​లో సినిమా చూస్తున్న లెప్టనింట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా

కశ్మీర్​లో థియేటర్లు కనుమరుగైన వేళ...
హిందీ ఫిల్మ్​ ఇండస్ట్రీ కలర్​ సినిమాలను తెరకెక్కిస్తున్న సమయంలో షమ్మి కపుర్​ సాంగ్​ గుల్మార్గ్​లోని థియేటర్లలో హల్​చల్​ చేసింది. "చాహే కోయి ముఝే జంగ్లీ కహే" అని సాగే ఈ పాట అప్పట్లో సూపర్​హిట్​గా నిలిచింది. బాలీవుడ్ సినిమా షూటింగ్‌లకు కశ్మీర్ చిరునామాగా ప్రసిద్ధి చెందింది. అప్పటి బాలీవుడ్​ సినిమాల్లో కశ్మీర్ అందాలను అంతలా చూపించారు. అయితే కాశ్మీర్‌లో తీవ్రవాదం చెలరేగాక ఆ ట్రెండ్​ కనుమరుగైపోయింది.

ఐనాక్స్ మాల్​

1980లో ఈ ప్రాంతంలో దాదాపు 12 థియేటర్లు ఉండేవని, ఉగ్రవాదుల బెదిరింపులతో ఈ హాల్స్​ను మూసివేయాల్సివచ్చిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొన్ని థియేటర్లను పునః ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ 1999లో లాల్​ చౌక్​లోని రిగాల్​ సినిమా థియేటర్​పై గ్రెనేడ్​ దాడి జరగడం వల్ల ఆ ఆలోచనను మానుకున్నారు. మరో రెండు థియేటర్లైన నీలమ్​, బ్రాడ్వే తిరిగి ప్రారంభమైనప్పటికి జనాదరణ లేక వాటిని మూసివేయాల్సి వచ్చింది. ఇలా వరుస దాడులు జరిగినప్పటికి ఐనాక్స్ మాల్​ తెరవడం పట్ల కశ్మీర్ లోయలోని చిత్రనిర్మాతలు, కళాకారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

లెప్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా ట్వీట్​

ఇదీ చదవండి: ఉచితాలపై తగ్గని ఆప్.. తటపటాయిస్తున్న భాజపా.. 2022 బాద్​షా ఎవరో?

రష్మికకు మరో బంపర్​ ఆఫర్​.. బాలీవుడ్​లోనూ తగ్గేదేలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.