Leopard attack student: ఉత్తర్ప్రదేశ్లో ఓ కళాశాలలోకి ప్రవేశించిన చిరుతపులి బీభత్సం సృష్టించింది. ఓ విద్యార్థిపై దాడి చేసింది. అలీగఢ్ జిల్లా ఛర్రా ప్రాంతంలోని ఓ ఇంటర్ కళాశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది.
Leopard college: చిరుత పులి కళాశాలలోకి రాగా.. విద్యార్థులంతా భయాందోళనకు గురయ్యారు. అందరూ కళాశాల బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిపై చిరుత దాడి చేసింది. అదృష్టవశాత్తు అతడు గాయాలతో బయటపడ్డాడు. క్లాస్రూంలోని కుర్చీల మధ్య చిరుత తిరుగుతున్న దృశ్యాలు.. సీసీటీవీలో రికార్డయ్యాయి.
"తమ కళాశాలలోకి ఉదయం 10 గంటలకు చిరుత పులి ప్రవేశించిందని చౌదరీ నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్ నాకు తెలియజేశారు. జిల్లా అటవీ అధికారులు, ఇతర అధికారులకు కూడా సమాచారం అందించారు. పులి దాడిలో ఓ విద్యార్థి గాయపడగా.. అతణ్ని ఆస్పత్రికి తరలించాం. అతినికి ప్రాణాపాయం లేదు" అని అలీగఢ్ జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ధర్మేంద్ర శర్మ తెలిపారు.
ఇదీ చూడండి: తల్లితో పులి పిల్లల విహారం.. వీడియో వైరల్
ఇదీ చూడండి: కుమారుడ్ని కరిచిందని కుక్కపై కర్కశత్వం- కత్తితో కోసి...