ETV Bharat / bharat

బంగాల్​లో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మెగా ర్యాలీ!

బంగాల్​లో కాంగ్రెస్-ఐఎస్ఎఫ్-వామపక్షాల కూటమి ఆదివారం నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టనుంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురీ, ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ సహా పలువురు నేతలు ర్యాలీకి హాజరు కానున్నారు. టీఎంసీ, భాజపాకు తమ కూటమి ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

bengal congress left campaign
బంగాల్​లో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మెగా ర్యాలీ!
author img

By

Published : Feb 27, 2021, 5:55 PM IST

కాంగ్రెస్-వామపక్ష కూటమి బంగాల్​లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. ఆదివారం నుంచి ప్రచార పర్వాన్ని మొదలు పెట్టనుంది. కోల్​కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి భారీ ర్యాలీ చేపట్టనుంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధురీ, కూటమిలోని మరో పార్టీ అయిన ఐఎస్ఎఫ్ అధినేత పిర్జాదా అబ్బాస్ సిద్ధిఖీ ఈ ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ సైతం ర్యాలీకి హాజరు కానున్నారు.

ప్రజా వ్యతిరేకంగా ఉన్న టీఎంసీకి, మతపరమైన రాజకీయాలు చేసే భాజపాకు తమ కూటమి ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ నేత ప్రదీప్ భట్టాచార్య పేర్కొన్నారు. టీఎంసీ, భాజపాతో పాటు కొన్ని మీడియా సంస్థలు బంగాల్ ఎన్నికలను ద్విముఖ పోటీగా చిత్రీకరిస్తున్నాయని, నిజానికి బంగాల్​లో త్రిముఖ పోరు నడుస్తోందని అన్నారు.

రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో ప్రచారం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ భావించినప్పటికీ.. ఇరువురు నేతలు ఇందుకు దూరంగా ఉన్నారు. కేరళలో ప్రత్యక్షంగా ఎల్​డీఎఫ్​తో తలపడుతున్న నేపథ్యంలో రాహుల్ ఆ రాష్ట్రంపైనే దృష్టిసారించారు.

వామపక్ష కార్యకర్తల ప్రచారం

'ప్రజల సైన్యం' అన్న పేరుతో సీపీఎం ఇప్పటికే వినూత్నంగా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సామాజిక మాధ్యమాలతో పాటు, బహిరంగంగా ప్రచారం నిర్వహిస్తోంది. పార్టీలోని యువ కార్యకర్తలు కోల్​కతాలోని పలు ప్రదేశాల్లో చిన్నచిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. షాపింగ్​ మాళ్లు, ట్రాఫిక్ కూడళ్లు, ప్రజలు గుమిగూడే బహిరంగ ప్రదేశాల్లో గత కొద్దివారాలుగా ఫ్లాష్ మాబ్​లు నిర్వహిస్తున్నారు. బ్రిగేడ్ ర్యాలీకి హాజరుకావాలని రూపొందించిన 'తుంప సోనా' పేరడీ పాట సైతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది.

బంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. భాజపా రాకతో ఈ పార్టీల ఓట్ల షేర్ పతనమైంది. 30 శాతం జనాభాతో బంగాల్​లో గెలుపోటములను నిర్ణయించే సత్తా ముస్లింలకు ఉంది. ఈ నేపథ్యంలో సిద్ధిఖీ నేతృత్వంలోని ఐఎస్ఎఫ్ పార్టీ రాకతో తమకు ప్రయోజనం చేకూరుతుందని కూటమి భావిస్తోంది.

బంగాల్ శాసనసభకు 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 37న 30 సీట్లకు జరిగే ఎన్నికతో తొలి దశ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 29న చివరి దశ జరుగుతుంది. ఫలితాలు మే 2న విడుదల కానున్నాయి.

ఇదీ చదవండి: 'మరో రెండేళ్ల వరకైనా ఉద్యమం చేసేందుకు సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.