ETV Bharat / bharat

పోలీసులు, వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ - బంగాల్​ నిరసనలు

కోల్​కతాలోని ఎస్ల్పేనేడ్​ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగాలు డిమాండ్​ చేస్తూ సెక్రటేరియట్​ ముట్టడికి బయల్దేరిన వామపక్ష కార్యకర్తలపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

బంగాల్​లో పోలీసులు, వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ
author img

By

Published : Feb 11, 2021, 3:37 PM IST

Updated : Feb 11, 2021, 4:27 PM IST

పశ్చిమ్​ బంగా కోల్​కతాలోని ఎస్ల్పేనేడ్​ ప్రాంతంలో వామపక్ష కార్యకర్తలు, పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఉద్యోగాల కోసం డిమాండ్​ చేస్తూ రాష్ట్ర సచివాలయానికి ర్యాలీ చేపట్టిన వామపక్షాలకు చెందిన విద్యార్థి, యువజన సంఘాలపై పోలీసులు జలఫిరంగులు ప్రయోగించినట్లు తెలుస్తోంది.

తొలుత నిరసనకారులు.. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేడ్లను తొలగించి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్​ కెనాన్లు, బాష్పవాయువును ప్రయోగించారు.

పోలీసు చర్యలో.. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయని వామపక్ష నేతలు ఆరోపించారు.

ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి కూడా గాయపడ్డారు.

Last Updated : Feb 11, 2021, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.