ETV Bharat / bharat

'మేము మద్యం ముట్టము'.. ప్రజలతో కలిసి సీఎం ప్రమాణం - మద్యపాన నిషేధం దిశగా బిహార్​

Liquor Consumption Oath: మద్యపాన నిషేధాన్ని మరింత కఠనంగా అమలు చేయడానికి బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.

Bihar takes pledge against liquor consumption
మధ్యపానం
author img

By

Published : Nov 26, 2021, 10:51 PM IST

Updated : Nov 27, 2021, 5:33 AM IST

Liquor Consumption Oath: బిహార్‌లో మద్యపాన నిషేధాన్ని మరింత కఠనంగా అమలు చేయడానికి ఆ రాష్ట్రముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ నడుంబిగించారు. రాష్ట్ర ప్రజలతో పాటు.. అన్నీ శాఖల ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి జీవితాంతం మద్యపానానికి దూరంగా ఉంటామని ప్రమాణం చేశారు. మద్యపానం ఆరోగ్యానికి మాత్రమే కాక.. సమాజానికి హానికరమని సీఎం అన్నారు. అందుకే ప్రజలందరూ.. ఈ ప్రమాణానికి కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు.

"మద్యాన్ని సేవించడం చెడ్డది మాత్రమే కాదు.. సమాజానికి అది అత్యంత ప్రమాదకారి కూడా. రాష్ట్రంలో ఇటీవల జరిగిన హూచ్ సంబంధిత మరణాలు ప్రజలకు ఇదే సందేశాన్నిస్తున్నాయి. అందుకే అందరూ లిక్కర్​ తీసుకోకుండా ఉండడానికి కట్టుబడి ఉండాలి."

- నితీశ్​ కుమార్​, బిహార్​ ముఖ్యమంత్రి

కొన్నేళ్లుగా బిహార్​లో పర్యటించే వారి సంఖ్య పెరుగుతుందని గుర్తు చేసిన ముఖ్యమంత్రి.. మద్యాన్ని బ్యాన్​ చేస్తే తప్పులేదనే వాస్తవాన్ని గ్రహించినట్లు పేర్కొన్నారు.

"నితీష్ కుమార్ అనే నేను... ఈరోజు నవంబర్ 26, 2021న జ్ఞాన్ భవన్​లో జీవితాంతం మద్యం సేవించనని నిశ్చితాభిప్రాయంతో ప్రమాణం చేస్తున్నాను. నేను డ్యూటీలో ఉన్నా లేకపోయినా మద్యం సేవించను. రోజువారీ జీవితంలో కూడా మద్యం సేవించనని ప్రమాణం చేస్తున్నాను."

- నితీశ్​ కుమార్​, బిహార్​ ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి: ఆ పాఠశాలలో 33మంది విద్యార్థులు, టీచర్​కు కరోనా

Last Updated : Nov 27, 2021, 5:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.