కేరళలో నాలుగు దశాబ్దాల సంప్రదాయానికి కళ్లెం వేసి.. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచిన వామపక్ష కూటమి గురువారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా మరో 20 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. పినరయి, ఇతర మంత్రులతో ప్రమాణం చేయించారు.
ఎల్డీఎఫ్లో భాగస్వామ్యపక్షాలైన జేడీఎస్, ఎన్సీపీకి చెందిన ఇద్దరు తప్ప.. మంత్రులంతా కొత్త వారే. ముగ్గురు మహిళలు విజయన్ కేబినెట్లో చేరారు. విజయన్ మేనల్లుడు పీఏ.మహమ్మద్ రియాజ్ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. కేరళ శాసనసభ చరిత్రలో మామ, అల్లుడు మంత్రివర్గంలో ఉండడం ఇదే తొలిసారి.
మోదీ శుభాకాంక్షలు..
కేరళ సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన పినరయ్ విజయన్‌కి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: 'మోదీజీ.. మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి? '