ETV Bharat / bharat

'భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకే ఎల్​డీఎఫ్​ యత్నం' - అయ్యప్ప భక్తులపై నడ్డా

కేరళ పినరయి విజయన్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఎన్నికల నేపథ్యంలో కొల్లాం జిల్లా కరునంగపల్లి ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రతిపక్ష యూడీఎఫ్​పైనా ధ్వజమెత్తారు. ఇరు పార్టీలు అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

nadda in kerala
'భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకే ఎల్​డీఎఫ్​ ప్రయత్నం'
author img

By

Published : Apr 1, 2021, 9:03 PM IST

కేరళ ఎల్​డీఎఫ్ ప్రభుత్వం​.. శబరిమల విషయంలో భక్తుల మనోభావాలని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దీనిపై ప్రతిపక్ష యూడీఎఫ్​ మౌనం వహిస్తోందని ఆక్షేపించారు. కొల్లాం జిల్లా కరునంగపల్లిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నడ్డా... పినరయి విజయన్ పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు.

అయ్యప్ప దేవాలయ ఆచారాలను కాపాడటానికి భాజపా విశ్వప్రయత్నాలు చేసిందని నడ్డా పేర్కొన్నారు. శబరిమల ప్రతిష్ఠను కాపాడేందుకు పాటుపడిన భక్తులపై పోలీసులు లాఠీ ఛార్జ్​లు జరిపారని అన్నారు. భక్తులపై కేసులు కూడా నమోదు చేయించారని అధికార ఎల్​డీఎఫ్ కూటమిపై మండిపడ్డారు.

ఎల్​డీఎఫ్, యూడీఎఫ్.. కేరళ సంస్కృతికి విఘాతం కలిగించాయని ఆరోపించారు నడ్డా. మహిళలను శబరిమలలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎల్​డీఎఫ్​ సర్కారు దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో భాజపా సారథ్యంలో భారీగా నిరసనలు వెల్లువెత్తాయని నడ్డా గుర్తుచేశారు.

ఇదీ చదవండి:సైనికుల కోసం తేలికపాటి బుల్లెట్​ ప్రూఫ్​ జాకెట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.