LB Nagar Murder Case Updates : రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది శివకుమార్ కేసులో(LB Nagar Murder Case Updates) .. పోలీసులు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సంఘవి, మృతుడు పృధ్వితేజ్, నిందితుడు శివకుమార్ పదోతరగతి వరకూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ చదివేందుకు అక్కాతమ్ముడు మహబూబ్‌నగర్ వెళ్లారు. డాక్టర్ కావాలనుకున్న సంఘవి ఇంటర్ తర్వాత.. నీట్ ర్యాంకు సాధించేందుకు రెండేళ్ల పాటు లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంది. పృధ్వి బీటెక్‌లో చేరాడు.
శివకుమార్ మాత్రం షాద్‌నగర్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2018లో డిగ్రీ పూర్తి చేసిన శివకుమార్.. మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం అతనికి సినిమాలపై ఆసక్తి ఉండటంతో.. భవిష్యత్‌పై దృష్టి పెట్టమని శివకుమార్‌ను.. తండ్రి శంకర్ మందలించాడు. దీంతో అతడు సుత్తితో.. తండ్రి తలపై కొట్టడంతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ క్రమంలోనే 10 రోజుల పాటు చికిత్స పొంది శంకర్ మరణించాడు.
ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే?
శివకుమార్ భవిష్యత్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన గ్రామస్తులు.. అంత్యక్రియలు నిర్వహించారు. అతడి తీరును చూసి.. అక్కడి ప్రజలు నిందితుడిని దూరం పెట్టారు. సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ చూట్టూ తిరుగుతున్న శివకుమార్.. ఓ సినిమాలో సైతం నటించాడు. కాగా కొన్ని నెలల క్రితం పాఠశాలలో గెట్ టూ గెదర్‌లో శివకుమార్, సంఘవిలు మళ్లీ కలుసుకున్నారు. అప్పటి నుంచి.. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానంటూ అతను వెంటపడ్డాడు.
మరోవైపు నీట్ ర్యాంకు రావకపోవడంతో సంఘవి.. రామాంతపూర్‌లోని హోమియోపతి కళాశాలలో చేరింది. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని.. సోదరులు పృద్వి, రోహిత్‌తో పాటు మరో బంధువు శ్రీనివాస్‌తో కలిసి ఉంటోంది. ఈ విషయం తెలిసి శివకుమార్ సైతం రామాంతపూర్‌లో నివాసం ఉంటున్నాడు. జీవితంలో స్థిరపడి సంఘవిని ఒప్పించి వివాహం చేసుకోవాలని.. అతను ఎస్సై ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఉద్యోగం రాలేదు.
కాగా ఆదివారం కొందుర్గ్‌లో బంధవులు వివాహం ఉండటంతో.. సంఘవితో పాటు ఉండే రోహిత్, శ్రీనివాస్‌లు గ్రామానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న శివకుమార్ కర్మాన్‌ఘాట్‌లోని సోదరిని తీసుకుని సంఘవి ఇంటికి వచ్చాడు. ఆమెతో మాట్లాడి వెంటనే వెళ్లినట్లు సమాచారం. సోదరిని వారి ఇంట్లో దింపి మళ్లీ కత్తి తీసుకుని శివకుమార్ సంఘవి ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే సంఘవిపై దాడి (A Lover Attack on Young Woman With Knife) చేసేందుకు ప్రయత్నించగా అడ్డువచ్చిన.. సోదరుడు పృధ్వితేజ్‌పై కత్తితో శివకుమార్ దాడి చేశాడు.
Jhansi Saved Young Woman from Lover Attack in LB Nagar : ఈ దాడిలో పృధ్వితేజ్ మృతి చెందగా.. స్థానికుల అప్రమత్తతో సంఘవి ప్రాణాలతో బయటపడింది. శివకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు పొంతనలేని సమాధానం చెబుతున్నాడు. సంఘవిని వివాహం చేసుకోవాలనకున్నానని పోలీసులకు తెలిపాడు. అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం రంగారెడ్డి కోర్టులో హజరుపరిచారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం శివకుమార్‌ను.. పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
అర్ధరాత్రి ఇంట్లో చొరబడి.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది
A Lover Attacked With Knife Young Woman : జగద్గిరిగుట్టలో యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి