ETV Bharat / bharat

డ్యాన్స్​తో అదరగొట్టిన కేంద్ర మంత్రి.. మోదీ కితాబు - మోదీ కిరణ్ రిజిజు డాన్స్

అరుణాచల్​ ప్రదేశ్​ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంప్రదాయ నృత్యంతో (Kiren Rijiju dance) అలరించారు. అక్కడి ప్రజలతో కలిసి లయబద్ధంగా కాలు కదిపారు. ఈ వీడియోపై స్పందించిన మోదీ.. రిజిజు మంచి డ్యాన్సర్ అంటూ కొనియాడారు.

kiren rijiju dance news
డ్యాన్స్​తో అదరగొట్టిన కేంద్ర మంత్రి.. మోదీ కితాబు
author img

By

Published : Sep 30, 2021, 9:58 PM IST

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సంప్రదాయ నృత్యంతో (Kiren Rijiju dance) అలరించారు. అభివృద్ధి పనులను పరిశీలించేందుకు బుధవారం ఆయన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కజలాంగ్ గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి 'సాజొలాంగ్‌' ప్రజలు ఆయనకు జానపద గీతాలు, సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు.

ఈ క్రమంలో ఆయన సైతం లయబద్ధంగా నృత్యం (Kiren Rijiju dance) చేశారు. సంప్రదాయ వాయిద్యాలు, గ్రామస్థుల చప్పట్లు, కేరింతల నడుమ ఉల్లాసంగా అడుగులు కదిపారు. అనంతరం ఈ వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

  • During my visit to beautiful Kazalang village to monitor the Vivekananda Kendra Vidyalaya Projects. This is traditional merrymaking of Sajolang people whenever guests visit their village. The original folk songs and dances are the ESSENCE of every community in Arunachal Pradesh. pic.twitter.com/TTxor4nQJF

    — Kiren Rijiju (@KirenRijiju) September 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"వివేకానంద కేంద్ర విద్యాలయ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి అందమైన కజలాంగ్ గ్రామానికి వెళ్లా. ఎవరైనా అతిథులు తమ గ్రామాన్ని సందర్శించినప్పుడల్లా సాజోలాంగ్ ప్రజల ఆనందం ఇది. ఇక్కడి జానపద పాటలు, నృత్యాలు.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి" అని ట్వీట్‌ చేశారు.

మోదీ స్పందన

ఈ వీడియో ట్వీట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. 'న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మంచి డ్యాన్సర్‌! అరుణాచల్‌ ప్రదేశ్‌ అద్భుతమైన సంస్కృతిని చూడటం బాగుంది' అని ట్వీట్‌ చేశారు. నెటిజన్లు సైతం రిజిజును కొనియాడుతూ.. కామెంట్లు పెడుతున్నారు.

అరుణాచల్ పశ్చిమ స్థానం నుంచి ఎంపీగా ఉన్న రిజిజు.. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్ సంబంధిత వీడియోలను పోస్ట్‌ చేస్తుంటారు. ఇటీవల ఆయన ఓ బాలీవుడ్‌ గీతాన్ని పాడి అదరగొట్టారు కూడా.

ఇదీ చదవండి: సిబల్ ఇంటి వద్ద నిరసనలపై జీ23 నేతల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.