దేశంలో బుధవారం కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 16,738 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 138మంది వైరస్‌కు బలయ్యారు.
- మొత్తం కేసులు: 1,10,46,914
- మరణాలు: 1,56,705
- రికవరీల సంఖ్య: 1,07,38,501
- యాక్టివ్ కేసులు: 1,51,708
కొవిడ్ బారినపడిన వారిలో 11,799 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.21 శాతానికి చేరింది. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా మరో 5,03,947 మందికి కొవిడ్ టీకా అందించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1కోటి26 లక్షల71వేలక163కు దాటినట్టు పేర్కొంది.
ఇదీ చూడండి: దేశంలో మరో 13,742 కేసులు.. 104 మరణాలు