తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో భాజపాలో చేరికల జోరు పెరుగుతోంది. తమిళ దిగ్గజ నటుడు దివంగత శివాజీ గణేశన్ కుమారుడు, సినీ నిర్మాత రామ్ కమార్ గురువారం.. భాజపాలో చేరారు. చెన్నై కార్పొరేషన్ మాజీ మేయర్ కరాటే ఆర్ త్యాగరాజన్ కూడా కమల తీర్థం పుచ్చుకున్నారు.
భాజపా సీనియర్ నేత, తమిళనాడు ఇన్ఛార్జ్ సీటీ రవి, భాజపా తమిళనాడు అధ్యక్షుడు ఎల్ మురుగన్ సమక్షంలో రామ్ కుమార్ తన కుమారుడు దుష్యంత్ సహా ఆ పార్టీలో చేరారు. తన తండ్రి నమ్మిన జాతీయ వాదం తమిళనాడులో మళ్లీ తిరిగి రావాలనే ఉద్దేశంతోనే తాను భాజపాలో చేరినట్లు రామ్‌కుమార్ వివరించారు.
ఒకప్పుడు అన్నాడీఎంకే, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన 'కరాటే' త్యాగరాజన్.. ఇప్పుడు తన మద్దతుదారులతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. తమిళనాడులో ఈ ఏడాది ఏప్రిల్, మేలో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి:కేరళలో 'బ్యాక్ డోర్' రాజకీయం- విజయన్‌కు కష్టమే!