హరియాణా కర్నాల్‌లోని మినీ సెక్రటేరియట్‌ను చుట్టుముట్టేందుకు తరలివచ్చిన వేలాది మంది రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. సచివాలయం ఎదుటే బైఠాయించారు. ఈక్రమంలో నిరసనల్లో పాల్గొన్న రైతులకు భోజనాలు ఏర్పాటు చేశారు స్థానిక నేతలు.
మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హరియాణా ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. పోలీసులు సైతం సచివాలయం వద్దే ఉండాల్సి వచ్చింది. ఓవైపు పోలీసులు, మరోవైపు రైతులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది.
లాఠీఛార్జ్‌కు నిరసనగా..
ఆగస్టు 28న కర్నాల్ ప్రాంతంలో రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని రైతు సంఘాలు అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం న్యూ అనాజ్ మండీ వద్ద మహాపంచాయత్ నిర్వహించగా.. సభకు పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వేలాది మంది రైతులు తరలివెళ్లారు. లాఠీఛార్జ్‌కు ఆదేశాలిచ్చిన ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేయాలన్నదే తమ డిమాండ్ అని బీకేయూ నేత రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: రైతుల నిరసన బాట- హరియాణాలో ఉద్రిక్తత