ETV Bharat / bharat

జవాను భార్యపై ఇంటి ఓనర్ అత్యాచారయత్నం.. 8ఏళ్ల బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి అత్యాచారం - ఉత్తరాఖండ్ రేప్ కేస్

అద్దె ఇంట్లో ఉంటున్న జవాను భార్యపై.. ఆ ఇంటి యజమాని అత్యాచారానికి యత్నించారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది. మరోవైపు, ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు. గుజరాత్​లో జరిగిందీ ఘటన.

landlord-attempts-to-rape
landlord-attempts-to-rape
author img

By

Published : Jan 17, 2023, 10:47 PM IST

Updated : Jan 18, 2023, 6:28 AM IST

వృత్తిరీత్యా టీచర్ అయిన ఓ వ్యక్తి తన ఇంట్లో అద్దెకు ఉంటున్న జవాను భార్యపై అత్యాచారయత్నం చేశాడు. ఉత్తరాఖండ్​లోని రుద్రపుర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని అతడిని అరెస్టు చేశారు.

రెండు నెలల క్రితం జవాను తన భార్యతో కలిసి నిందితుడి ఇంట్లో అద్దెకు దిగాడు. జనవరి 15న నిందితుడి కుటుంబ సభ్యులు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యజమాని.. జవాను భార్యపై అఘాయిత్యం చేసేందుకు యత్నించాడు. జవాను డ్యూటీకి వెళ్లిన తర్వాత అతడి భార్యపై లైంగిక దాడి చేయాలని ప్రయత్నించాడు. అయితే, ఆ సమయంలో జవాను భార్య.. తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్​లో మాట్లాడుతోంది. యజమాని వచ్చి లైంగికంగా దాడికి యత్నించడం వారి కంట పడింది. దీంతో వెంటనే వారు పోలీసులకు, మహిళ భర్తకు ఫోన్ చేశారు. వెంటనే ఇంటికి వచ్చాడు జవాను. ఇంటి యజమాని తన భార్యను ఓ గదిలోకి లాక్కెళ్లడాన్ని జవాను చూశాడు. అతడిని పట్టుకున్న జవాను.. పోలీసులకు అప్పగించాడు.

రేప్, మర్డర్
గుజరాత్​లోని బొటాడ్​లో ఎనిమిదేళ్ల బాలిక శవం కనిపించడం కలకలం రేపింది. బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం బాలికను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారని, జిల్లాలోని భగవాన్​పొరా ప్రాంతంలో ఆమె శవం కనిపించిందని పోలీసులు తెలిపారు.

'సంక్రాంతి రోజున ఇంటి సమీపంలో పడిపోయిన పతంగులను తెచ్చుకొనేందుకు బాలిక సాయంత్రం 4.30 గంటల సమయంలో బయటకు వెళ్లింది. ఎంత సేపటికీ ఆమె ఇంటికి రాకపోయే సరికి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాలిక కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోయే సరికి మాకు సమాచారం ఇచ్చారు. నిర్మానుష్య ప్రదేశంలో అర్ధనగ్నంగా ఉన్న బాలిక శవం దొరికింది. బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కినట్లు తెలుస్తోంది' అని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాలిక శవాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం సోనావాలా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

హాస్టల్​లో శవమై...
ఝార్ఖండ్​ రాంచీలోని ఐఐఎం హాస్టల్​లో ఓ యువకుడు శవమై కనిపించాడు. అతడి చేతులు వెనక నుంచి కట్టేసి ఉన్నాయని, సీలింగ్​కు వేలాడుతూ శవం కనిపించిందని పోలీసులు వెల్లడించారు. అన్ని కోణాల్లో దీనిపై విచారణ చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఇది ఆత్మహత్యేనా? కాదా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం పరీక్షల తర్వాతే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మృతుడిని ఉత్తర్​ప్రదేశ్​ వారణాసికి చెందిన శివమ్​గా గుర్తించారు.

మూడో అంతస్తు నుంచి దూకిన మహిళ..
మంటల్ని తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి దూకేసింది ఓ మహిళ. బిహార్​లోని నవాదా జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో ఏడుగురు ఉన్నారు. ఐదుగురు ఎలాగోలా ఇంట్లో నుంచి బయటపడ్డారు. ఓ మహిళ, ఓ చిన్నారి ఇంట్లో చిక్కుకున్నారు. చివరకు చేసేదేమీ లేక, చిన్నారిని బ్లాకెట్ల​లో చుట్టి కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. చివరకు మహిళ కిటికీలో నుంచి దూకింది. ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. చిన్నారి మాత్రం సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల రూ.50లక్షల వరకు నష్టం జరిగిందని చెప్పారు.

Last Updated : Jan 18, 2023, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.