ETV Bharat / bharat

దిల్లీ ఎయిమ్స్​లో చేరిన లాలూ ప్రసాద్​ యాదవ్

Lalu Prasad Yadav: ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు.

lalu prasad yadav health
లాలూ ప్రసాద్ యాదవ్​
author img

By

Published : Nov 26, 2021, 8:32 PM IST

Updated : Nov 26, 2021, 8:58 PM IST

Lalu Prasad Yadav: ఆర్​జేడీ జాతీయ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం (lalu prasad yadav health) ఒక్కసారిగా క్షీణించింది. ఫలితంగా ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో శుక్రవారం చేరారు. జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పితో లాలూ బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయన రక్త నమూనాలను సేకరించి పరీక్షకు పంపినట్లు పేర్కొన్నారు. రిపోర్ట్​ల కోసం వేచి చూస్తున్నమన్నారు. ప్రస్తుతం లాలూ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

లాలూ ప్రసాద్​ యాదవ్​ (lalu prasad yadav news) మూడు రోజులుగా బిహార్‌లో ఉన్నారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన.. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో పార్టీ నేతలను ఓపెన్​ టాప్​ జీపులో ఎక్కించుకుని నడుపుతూ.. పట్నా వీధుల్లో చక్కర్లు కొట్టిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

దాణా కుంభకోణంలో (fodder scam in bihar) ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్​ యాదవ్​... ఇటీవలే జైలు నుంచి విడుదల అయ్యారు.

ఇదీ చూడండి: ఎప్పటికీ నేనే 'సారథి'ని.. జీప్​ డ్రైవ్ చేస్తూ లాలూ మెసేజ్!

Last Updated : Nov 26, 2021, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.