స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా లక్షద్వీప్‌లో కొత్త చట్టాలను ఖరారు చేయబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయనతో మాట్లాడిన అనంతరం లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ ఈ విషయాన్ని వెల్లడించారు. అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ ప్రతిపాదించిన కొత్త చట్టాలపై వ్యతిరేకత గురించి హోంమంత్రికి వివరించినట్లు తెలిపారు.
ద్వీపంలో కొత్త పాలనాధికారిగా నియమితులైన ప్రఫుల్ పటేల్‌ను పదవి నుంచి తప్పించాలనే విషయంపై అమిత్ షాను ఫైజల్ కోరినట్లు తెలుస్తోంది.
లక్షద్వీప్ జంతు సంరక్షణ చట్టం, సామాజిక వ్యతిరేక కార్యకలాపాల చట్టం, డెవలప్మెంట్ అథారిటీ చట్టం, పంచాయతీ సిబ్బంది నియమాల సవరణ, గోవధ నిషేధం వంటి చట్టాలపై లక్షద్వీప్ ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: తమిళనాట శశికళ 'రీఎంట్రీ' దుమారం