పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను(sidhu news) పోలీసులు నిర్బంధించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరికి(Lakhimpur kheri news) మార్చ్ చేపట్టిన ఆయన నేతృత్వంలోని బృందాన్ని హరియాణా- ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దులో పోలీసులు అడ్డగించారు. అనంతరం.. సిద్ధూ(sidhu news) సహా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను నిర్బంధంలోకి తీసుకున్నారు.
వీరందరినీ సర్సావా పోలీస్ స్టేషన్లో ఉంచారు.
అక్టోబర్ 3న లఖింపుర్ ఖేరిలో (Lakhimpur kheri incident) హింస చెలరేగింది. రైతులు నిరసన చేస్తుండగా.. కేంద్ర మంత్రి కాన్వాయ్ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. అనంతరం జరిగిన ఘర్షణలో(Lakhimpur kheri news) మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.